News April 11, 2025
గుంటూరు: హైదరాబాద్‌కు 4లైన్ నేషనల్ హైవే

ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన నేషనల్ హైవేల పనులు వేగవంతమయ్యాయి. పల్నాడు జిల్లా నుంచి గుంటూరు జిల్లా మీదుగా బాపట్ల జిల్లాకు వాడరేవు నుంచి పిడుగురాళ్ల వరకు 167ఏ జాతీయ రహదారి రూ.1,064.24 కోట్లతో నిర్మాణం జరుగుతోంది. ఈ ఏడాది ఆఖరికి హైవే పూర్తవుతుందని భావిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలను కలుపుతూ 4లైన్‌ల హైవేను హైదరాబాద్‌కు నిర్మించే పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తున్నట్టు సమాచారం.
Similar News
News April 22, 2025
పెదకూరపాడు: సివిల్స్‌లో సత్తా చాటిన రైతు బిడ్డ

పెదకూరపాడుకు చెందిన సామాన్య రైతు బిడ్డ చల్లా పవన్ కళ్యాణ్ సివిల్స్‌లో 146వ ర్యాంకు సాధించి సంచలనం సృష్టించాడు. పట్టుదలతో చదివి ఈ ఘనత సాధించినట్లు పవన్ తెలిపాడు. పవన్ విజయం జిల్లాకే గర్వకారణమని స్థానికులు కొనియాడారు. మంచి ర్యాంకు రావడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
News April 22, 2025
గుంటూరు వాహినిలో 25 వరకు తాగునీటి విడుదల

గుంటూరు జిల్లా తాగునీటి చెరువులను నింపాలని గుంటూరు వాహినికి ఈ నెల 25 వరకు తాగు నీటిని విడుదల చేస్తున్నామని, ఆయా తటాకాలను నీటితో నింపుకోవాలని డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ ఉప్పుటూరి సాంబశివరావు తెలిపారు. 25వ తేదీ తర్వాత మరమ్మతుల నిమిత్తం కాలువకు నీరు నిలిపివేస్తామని, రాబోయే రోజులలో పెదనందిపాడు మండల ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని కోరారు.
News April 22, 2025
తుళ్లూరు: అక్కను హత్య చేసిన తమ్ముడికి యావజ్జీవ శిక్ష

తుళ్లూరు మండలం కొత్తూరు గ్రామంలో 2017లో జరిగిన ఆస్తి తగాదా హత్య కేసులో సోమవారం న్యాయస్థానం శిక్ష విధించింది. అక్కను హత్య చేసి, ఆమె కూతురిపై దాడి చేసిన షేక్ నాగుల్ మీరావాలికి యావజ్జీవ శిక్షతో పాటు రూ.1000 జరిమానా, మరోసారి 307 సెక్షన్ కింద 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసు విచారణ చేసిన తుళ్లూరు మాజీ సీఐ సుధాకరరావు నేతృత్వంలోని బృందాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు.