News September 19, 2024
గుంటూరు: 100 రోజుల పాలనపై మీ కామెంట్.?
ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ఈ నెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్నక్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని YCP విమర్శిస్తోంది. 100 రోజుల పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్
Similar News
News October 15, 2024
కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన నరసరావుపేట ఎంపీ
రాష్ట్రంలో CRIF పథకం కింద రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ.400 కోట్లు విడుదల చేసిన కేంద్రమంత్రి నితిన్ గట్కారిని మంగళవారం ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పల్నాడులో దుర్గి-వెల్దుర్తి రహదారి, పలువాయి జంక్షన్-సత్రశాల రోడ్డు(వయా) పాశర్లపాడు, జెట్టిపాలెం రహదారికి నిధులు మంజూరైనట్లు ఎంపీ తెలిపారు. కుప్పగంజి వాగు నుంచి వోగేరు వాగు వరకు డ్రైన్ల నిర్మాణం కోసం గ్రాంట్ విడుదల చేయాలని కోరారు.
News October 15, 2024
గుంటూరు రైల్వే ఓవర్ బ్రిడ్జికి నిధులు.. గడ్కరీకి చంద్రబాబు కృతజ్ఞతలు
గుంటూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి పునర్నిర్మాణానికి రూ.98 కోట్లు కేంద్ర మంత్రి గడ్కరీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. గుంటూరు అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చొరవతో గడ్కరి చేసిన ప్రకటన ఎన్నో ఏళ్ల గుంటూరు వాసుల కల నెరవేర్చనుంది.
News October 15, 2024
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనగాని
తుపాను విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. 4 నుంచి 5 రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిందన్నారు. అతిభారీ వర్షాలు కురిసి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉన్నందున ప్రజలు అధికారుల సూచనలు పాటించి తక్షణం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులకు సూచించారు.