News April 20, 2025
గుంటూరు: 19 పరుగులు చేసిన రషీద్

వాంఖండే వేదికగా జరుగతున్న చైన్నై -ముంబాయి మ్యాచ్‌లో గుంటూరు కుర్రోడు షేక్ రషీద్ ఆదివారం పర్వాలేదనింపించారు. ఓపెనర్‌గా వచ్చి 20 బంతుల్లో 19 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. శాంట్నర్ వేసిన బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయ్యి వెనుదిరిగారు. కాగా.. దీనికంటే ముందు మ్యాచ్‌లో ఆరంగేట్రం చేసిన రషీద్ 27 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News April 21, 2025
‘ఖురేషీ’ ముస్లిం ఎన్నికల అధికారి .. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ SY ఖురేషీపై BJPఎంపీ నిశికాంత్ దూబే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఖురేషీ కమిషనర్‌గా ఉన్నకాలంలో ఝార్ఖండ్ సంతాల్ పరగణాల్లో బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఓటర్లుగా మార్చారని, ఆయన ముస్లిం ఎన్నికల కమిషనర్ అని’ Xలో ఆరోపించారు. కాగా వక్ఫ్ చట్టం ముస్లిం భూములను లాక్కోవడానికి చేసిన ప్లాన్ అని సుప్రీం కోర్టు దానిని గుర్తిస్తుందని ఖురేషీ చేసిన ట్వీట్‌కు ఎంపీ రిప్లై ఇచ్చారు.
News April 21, 2025
మహబూబాబాద్‌లో తహశీల్దార్లు బదిలీలు

మహబూబాబాద్ జిల్లాలో 8 మండలాల్లో పనిచేస్తున్న తహశీల్దార్లకు స్థానచలనం కలిగిస్తూ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గార్ల తహశీల్దారుగా శారద, సీరోల్-నారాయణమూర్తి, దంతాలపల్లి-సునీల్ కుమార్, గూడూరు-చంద్రశేఖర రావు, ఇనుగుర్తి-రవీందర్, కురవి-శ్వేత నూతన తహసీల్దార్లుగా నియమితులయ్యారు.
News April 21, 2025
ఈ వారంలో ‘కింగ్‌డమ్’ ఫస్ట్ సింగిల్: నాగవంశీ

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్‌డమ్’ మూవీపై నిర్మాత నాగవంశీ అప్డేట్ ఇచ్చారు. ఈ వారంలోనే ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.