News September 7, 2024
గుంటూరు: 2 రోజుల్లోనే పూర్తయిన గేట్ల మరమ్మతులు
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు పూర్తి చేశారు. 67, 69వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను శనివారం మధ్యాహ్నం నాటికి విజయవంతంగా అమర్చారు. భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా రెండు రోజుల్లోనే ఇంజినీర్లు, సిబ్బంది గేట్ల మరమ్మతు పనులు పూర్తి చేశారు. నదిలో లక్షన్నర క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నా సాహసోపేతంగా పనిచేసి గేట్లు అమర్చారు. నిపుణుడు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో ఈ పనులు చేశారు
Similar News
News October 12, 2024
గుంటూరు: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి.?
దసరా పండుగ అనగానే అందరికీ పల్లెటూరు గుర్తుకు వచ్చేస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, స్నేహితులు కలిసి ఊరంతా సంతోషంగా తిరుగుతూ ఉంటారు. ఊరిలో అందరినీ పలకరిస్తూ.. ఉంటే ఆ ఆనందం మాట్లల్లో చెప్పలేని సంతోషాన్ని ఇస్తుంది. ప్రతి ఊరితో ఒక్కో విధంగా పండుగను జరుపుకుంటారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
News October 12, 2024
తెలుగుజాతి ఎప్పటికీ మరిచిపోలేని పేరు ఎన్టీఆర్: జీవీ ఆంజనేయులు
చరిత్ర ఉన్నంత కాలం తెలుగుజాతి ఎప్పటికీ మరిచిపోలేని పేరు ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. శనివారం వినుకొండ సురేష్ మహల్ రహదారిలో ఆర్చ్ నిర్మాణానికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నటుడిగా, ముఖ్యమంత్రిగా, అంతకు మించిన మహనీయుడిగా తెలుగువారి గుండెల్లో అంతగా చెరగని ముద్రవేశారని కొనియాడారు.
News October 12, 2024
తుళ్లూరులో మద్యం దుకాణాలకు భారీ డిమాండ్
ఏపీలో మద్యం దుకాణాల అనుమతికి గుంటూరు, NTR జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో 127 దుకాణాలకు 4,396 దరఖాస్తులు అందాయి. తొలి 10అత్యధిక దరఖాస్తుల్లో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుంచే 8 ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు (104)దుకాణానికి 95దరఖాస్తులు, తుళ్లూరు (102) షాపునకు 86దరఖాస్తులు, తుళ్లూరు(103)దుకాణానికి 82 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.