News August 19, 2024
గుంటూరు: 21న జిల్లా అథ్లెటిక్ జట్ల ఎంపిక

అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో అండర్ -14, 16 బాలబాలికలు, అండర్-18, 20 యువతీ, యువకుల జిల్లా స్థాయి అథ్లెట్ల ఎంపిక నిర్వహిస్తామని ప్రధాన కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ తెలిపారు. ఈ పోటీలు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 21న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారిని సెప్టెంబరు 14 నుంచి 16వ తేదీ వరకు ఏఎన్ యూలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు.
Similar News
News December 16, 2025
GNT: నూతన కానిస్టేబుల్స్‌తో నేడు సీఎం సమావేశం

పోలీసు శాఖలో నూతనంగా జాయిన్ అవుతున్న వారితో CM చంద్రబాబు మంగళగిరిలో నేడు సమావేశం కానున్నారు. 6,100 మందిని రిక్రూట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 6,014 మంది సెలక్ట్ అయ్యారు. వీరిలో 5,757 మంది ట్రైనింగ్‌కు ఎంపిక అయ్యారు. సివిల్ కానిస్టేబుళ్లుగా 3,343 మంది, APSP కానిస్టేబుళ్లుగా 2,414 మంది ఎంపికవ్వగా సివిల్‌లో మహిళా కానిస్టేబుళ్లు 993 మంది ఉన్నారు. వీరికి ఈ నెల నుంచి ట్రైనింగ్ మొదలవుతుంది.
News December 16, 2025
GNT: శాబర్ జెట్‌ను కూల్చిన ఆంధ్ర వీరుడు

1965 ఇండో-పాక్ యుద్ధంలో పాకిస్థాన్ శాబర్ జెట్‌ను కూల్చి చరిత్ర సృష్టించిన వ్యక్తి తెనాలి సమీప నిజాంపట్నానికి చెందిన హవల్దార్ తాతా పోతురాజు. పాత ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌తో శత్రు విమానాన్ని ఛేదించి భారత సైన్యానికి స్ఫూర్తినిచ్చారు. ఈ వీరోచిత సేవలకు రాష్ట్రపతి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ‘వీరచక్ర’ పురస్కారం అందుకున్నారు. 18 ఏళ్లకే సైన్యంలో చేరిన పోతురాజు 1975లో స్వచ్ఛంద విరమణ చేశారు.
News December 16, 2025
నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు

టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు మంగళవారం రానున్నారు. ఈ సందర్భంగా త్రిసభ్య కమిటీలతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల కమిటీలపై స్పష్టతకు రావడమే లక్ష్యంగా టీడీపీ అధిష్ఠానం ముందడుగు వేస్తుండగా, సంస్థాగత నిర్మాణంపై పార్టీ అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. జిల్లా కమిటీల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తికాగా, త్వరలోనే రాష్ట్ర కమిటీని కూడా ఖరారు చేసే అవకాశం ఉంది.


