News April 15, 2025

గుంటూరు: 22 కేసుల్లో ముద్దాయి అరెస్ట్

image

2019 నుంచి గుంటూరు, నంద్యాల జిల్లాల్లో దారిదోపిడులు, దొంగతనాలు చేస్తున్న చెంచు హనుమంతును ఎట్టకేలకు నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. సుగాలిమెట్ట సమీపంలోని జంబులమ్మ గుడివద్ద పట్టుకున్న సమయంలో అతని వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులోనూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న హనుమంతుతో పాటు అతడి ముఠా సభ్యులపై 22 కేసులు నమోదై ఉన్నట్లు ఎస్పీ అదిరాజ్ సింగ్ వెల్లడించారు.

Similar News

News February 24, 2026

ప్రైవేటుకు దీటుగా జూనియర్ కాలేజీలు: లోకేశ్

image

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ శాసనమండలిలో తెలిపారు. వీటిని ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యాశాఖను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్‌లో మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు ఇస్తోందన్నారు. త్వరలో ల్యాబ్‌లు ఏర్పాటు చేసి, పోటీ పరీక్షల మెటీరియల్ కూడా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

News February 24, 2026

గుంటూరు: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. మంగళవారం గుంటూరు ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించారు. పరీక్షా కేంద్రంలో కనీస అవసరాలైన తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకొనుటకు బస్ సౌకర్యం అంశాలను అడిగారు.

News February 24, 2026

గుంటూరు ఛానల్ వంతెన నిర్మాణానికి నిధులు

image

గుంటూరు ఛానల్‌పై వంతెన పునర్నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఛానల్‌లోని 33.300 కి.మీ వద్ద సింగిల్ లేన్ వంతెన నిర్మించనున్నారు. దీని కోసం రూ.94.88 లక్షలు కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జలవనరుల శాఖ ఈ మేరకు జీవో-92 విడుదల చేసింది. తగిన సాంకేతిక అనుమతులు తీసుకుని, నిబంధనల ప్రకారం పనులు ప్రారంభించాలని కృష్ణా డెల్టా చీఫ్ ఇంజినీర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.