News April 24, 2024

గుంటూరు: 29 నుంచి రాయగడ ఎక్స్ ప్రెస్ రద్దు

image

ఇంజినీరింగ్ పనుల కారణంగా ఈనెల 29వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు గుంటూరు- రాయగడ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ (17243) రైలు రద్దు చేసినట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. అదే విధంగా రాయగడ నుంచి గుంటూరు వచ్చే (17244) ఈనెల 30వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు నిలిపివేసినట్లు తెలిపారు. ఈ మేరకు రైల్వే ప్రయాణికులు గమనించాలని తెలిపారు.

Similar News

News January 16, 2025

గుంటూరు: పీఎం ఇంటర్న్‌షిప్‌ పోస్టర్ల ఆవిష్కరణ

image

యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పీఎం ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం ప్రారంభించిందని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. కలెక్టరేట్లో ఈ పథకం సంబంధించిన వాల్ పోస్టర్లను జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావుతో కలిసి ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులన్నారు. https://mca.gov.in/login/లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News January 16, 2025

గుంటూరు: పలు పోస్టులకు నోటిఫికేషన్‌

image

గుంటూరు DCCBలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ మేనేజర్‌, స్టాఫ్‌ అసిస్టెంట్‌/క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు ఇందుకు సంబంధించి వివరాలను అధికార సైట్లో ఉంచారు. గుంటూరు DCCBలో 31 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు, 50 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా ఈనెల 22లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరిలో ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహించే అవకాశముంది. 

News January 16, 2025

గుంటూరు: అత్తగారింట్లో 200 రకాల పిండి వంటలతో విందు

image

గుంటూరుకు చెందిన త్రిపురమల్లు వైష్ణవ్‌‌కు మొగల్తూరుకి చెందిన విష్ణు ప్రియతో గత ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. సంక్రాంతి సందర్భంగా తొలి పండుగకు అల్లుడితో పాటు కుటుంబ సభ్యులను విష్ణు ప్రియ తల్లిదండ్రులు ఫణి, ఝాన్సీలు ఆహ్వానించారు. దీంతో వారు బుధవారం మెుగల్తూరులో కొత్త అల్లుడు వైష్ణవ్‌కు 200 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేసి మర్యాద చేశారు.