News October 29, 2024
గుంటూరు: 54,065 మిర్చి టిక్కీల అమ్మకం

మిర్చియార్డుకు సోమవారం 63,735 మిర్చి టిక్కీలు విక్రయానికి రాగా ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 54,065 అమ్మకం జరిగినట్లు గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు తెలిపారు. ఇంకా యార్డు ఆవరణలో 28,584 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు కార్యదర్శి పేర్కొన్నారు.
Similar News
News December 1, 2025
గుంటూరులో 2,56,904 మందికి రూ.111.34కోట్ల పంపిణీ

జిల్లాలో ప్రతి నెల 2,56,904 మందికి లబ్దిదారులకు రూ.111.34కోట్ల పంపిణీ జరుగుతోంది. వీరిలో వృద్ధాప్యపు పింఛన్‌లు 1,18,174, వితంతు 70,112, చేనేత 3,862, గీతకార్మికులు 443, మత్స్యకారులు 570, ఒంటరి మహిళలు 11,330, చర్మకారులు 876, హిజ్రాలు 67, HIV బాధితులు 2,614, కళాకారులు 77, డప్పు కళాకారులు 854, దివ్యాంగులు 24,835, వైద్య సంబంధిత 1667, సైనిక సంక్షేమం 28, అభయహస్తం 3,994, అమరావతి భూముల సంబంధిత 17,401మంది.
News December 1, 2025
అమరావతిలో రూ.750 కోట్లతో యోగా, నేచురోపతి ఇన్‌స్టిట్యూట్

రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక ‘ఎపెక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ యోగా & నేచురోపతి’ ఏర్పాటు కానుంది. దీనికోసం త్వరలో 40 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించనుంది. మొత్తం రూ. 750 కోట్ల భారీ వ్యయంతో దీనిని నిర్మించనున్నారు. ఇందులో 450 పడకల నేచురోపతి ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. అలాగే యోగా, నేచురోపతి కోర్సుల్లో 100 (UG), 20 (PG) సీట్లతో విద్యావకాశాలు కల్పించనున్నారు.
News December 1, 2025
GNT: శీతాకాల సమావేశాలు.. ఎంపీ స్టాండ్ ఏంటి.!

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధానంగా అమరావతి రాజధాని అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫండింగ్ & ప్రాజెక్టులు, పోలవరం, అమరావతి క్యాపిటల్ రీజన్ అభివృద్ధి నిధులు, రైల్వే & రోడ్ ప్రాజెక్టుల పెండింగ్ నిధులు, నూతన ప్రాజెక్టులపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.


