News February 1, 2025
గుంటూరు: 63.4% మేర జరిగిన పింఛన్ల పంపిణీ

గుంటూరు జిల్లాలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన NTR భరోసా పింఛన్ల పంపిణీ శనివారం ఉదయం 10 గంటల వరకు 63.4% మేర పంపిణీ అయ్యింది. జిల్లాలో 2,53,464 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా 1,60,700 మందికి ప్రభుత్వ యంత్రాంగం పింఛన్ అందజేసినట్లు అధికారిక డాష్‌బోర్డు ద్వారా తెలుస్తోంది. కాగా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పింఛన్ పంపిణీకి రాజకీయ పక్షాల నేతలు దూరంగా ఉన్నారు.
Similar News
News February 19, 2025
గుంటూరు: MDMA వినియోగిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థుల అరెస్ట్

MDMA నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తూ, వినియోగిస్తున్న 9 మంది ఇంజినీరింగ్ విద్యార్థులను గుంటూరు ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన నితిన్ కాజ గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సాయికృష్ణకు MDMA విక్రయించాడు. ఆ మత్తు పదార్థాలను సాయికృష్ణ గోరంట్లలో ఉంటూ ఇంజినీరింగ్ కళాశాలలకు విక్రయించాడు. మొత్తం 11 మంది ఉండగా 9 మందిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
News February 19, 2025
గుంటూరు: ‘కారు ఢీకొని పారిశుద్ధ్య కార్మికురాలి మృతి’

కారు ఢీకొని పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందిన ఘటన సంగడిగుంట లాంఛెస్టర్ రోడ్డులో చోటుచేసుకుంది. గాంధీనగర్‌కి చెందిన కొండమ్మ (58) విధుల్లో ఉండగా ఓ యువకుడు తన కారు కింద ఉన్న కుక్కల్ని బయపెట్టడానికి ఎక్సలేటర్ ఇచ్చాడు. అప్పటికే గేరులో ఉన్న కారు పారిశుద్ధ్య కార్మికురాలిపైకి దూసుకువెళ్లడంతో ఆమె మృతిచెందినట్లు ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కమిషనర్ శ్రీనివాసులు, కార్మిక సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి.
News February 19, 2025
ANU: BED పరీక్షల కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారులు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం నుంచి బీ.ఫార్మసీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో 16, ప్రకాశం జిల్లాలో మూడు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఈ మేరకు విశ్వవిద్యాలయం పీజీ అండ్ ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షల సమన్వయకర్త ఎం.సుబ్బారావు నాగార్జున వర్సిటీ ఫార్మసీ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లు పరిశీలించారు.