News March 1, 2025
గుంటూరు: 80 ఏళ్ల వయస్సులో మూడు బంగారు పతకాలు

గుంటూరుకు చెందిన దివాకర్(80) ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో జరిగిన 80 సంవత్సరాల స్పోర్ట్స్ మీట్‌లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు. హేమర్, జావలిన్, డిస్క్ త్రోలో వరుసగా మూడు బంగారు పథకాలను సాధించారు. గుంటూరు ఆఫీసర్స్ క్లబ్ మేనేజర్‌గా ఈయన పనిచేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో అనంతపూర్‌లో జరిగిన పోటీలలో కూడా 3 బంగారపు పతకాలను కైవసం చేసుకున్నాడు. దీంతో ఈయనను పలువురు అధికారులు అభినందించారు.
Similar News
News March 26, 2025
రేపు పోలవరం ప్రాజెక్ట్ పరిశీలించనున్న చంద్రబాబు

రేపు పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ఈ మేరకు బుధవారం సీఎమ్ఓ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పర్యటనలో భాగంగా సీఎం పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు హిల్ వ్యూకు సీఎం చేరుకోనున్నారు. డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యామ్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్ట్ పనులపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు.
News March 26, 2025
GNT: రూ.15కోట్లతో విద్యుత్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్‌ల ఏర్పాటు

గుంటూరు-1, మంగళగిరి ఆర్టీసీ డిపోల్లో రూ.15కోట్లతో విద్యుత్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కాబోతున్నాయి. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో గుంటూరుకు 150 బస్సులు మంజూరైన సంగతి తెలిసిందే. 100 బస్సులు గుంటూరు డిపోకి, మిగిలిన 50 బస్సులు మంగళగిరి డిపోకు కేటాయించనున్నారు. బస్సులు ఛార్జింగ్ పెట్టేందుకు బుడంపాడు నుంచి 3kv విద్యుత్ లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ బస్సులు 40కి.మీ. ప్రయాణిస్తాయి.
News March 26, 2025
మంగళగిరి: అఘోరి శిష్యురాలి వ్యవహారంలో ట్విస్ట్

అఘోరి శిష్యురాలి వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ మేరకు మంగళవారం మంచిర్యాల జిల్లా నెన్నెల పోలీసు స్టేషన్‌లో శ్రీవర్షిణి ఫిర్యాదు చేసింది. అఘోరితో కలిసివచ్చి శ్రీవర్షిణి ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రులు, కేర్‌టేకర్ విష్ణుతో ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. ఇష్ట పూర్వకంగానే అఘోరిగా మారినట్లు శ్రీవర్షిణి తెలిపింది.