News October 2, 2024

గుంటూరు: 97.22 శాతం మందికి పింఛన్ల పంపిణీ

image

గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛను పథకంలో మొదటి రోజు 97.22 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ నగదు రూ.4వేలు చొప్పున అందజేశారు. జిల్లాలో 2,56,017 మంది పింఛన్ దారులకు రూ.109.19కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. కాగా 2,48,901 మందికి రూ.106.10కోట్లు పంపిణీ చేశారు.

Similar News

News December 16, 2025

నేడు సీఎం చంద్రబాబు బిజీ డే షెడ్యూల్‌

image

@ 10:15 గంటలకు సచివాలయానికి చేరుకున్న సీఎం, రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సేవల అమలుపై సమీక్ష నిర్వహించారు.
@ మధ్యాహ్నం 3:15 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు.
@ సాయంత్రం 4:55 గంటలకు మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌కు చేరుకున్నారు. 5 గంటలకు కొత్తగా నియామకమైన కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో పాల్గొంటారు.
@ రాత్రి 7.20 గంటలకు సీఎం తన నివాసానికి చేరుకుంటారు.

News December 16, 2025

GNT: నిలకడగా స్క్రబ్ టైఫస్ రోగుల ఆరోగ్య పరిస్థితి

image

గుంటూరు జీజీహెచ్‌లో స్క్రబ్ టైఫస్ జ్వరాలతో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బుధవారం జీజీహెచ్‌కు వచ్చిన 13 మంది జ్వర బాధితుల నమూనాలను పరీక్షించగా, మంగళగిరి, అమృతలూరుకు చెందిన ఇద్దరికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ ఇద్దరిని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుని వైద్యం అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

News December 16, 2025

GNT: నూతన కానిస్టేబుల్స్‌తో నేడు సీఎం సమావేశం

image

పోలీసు శాఖలో నూతనంగా జాయిన్ అవుతున్న వారితో CM చంద్రబాబు మంగళగిరిలో నేడు సమావేశం కానున్నారు. 6,100 మందిని రిక్రూట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 6,014 మంది సెలక్ట్ అయ్యారు. వీరిలో 5,757 మంది ట్రైనింగ్‌కు ఎంపిక అయ్యారు. సివిల్ కానిస్టేబుళ్లుగా 3,343 మంది, APSP కానిస్టేబుళ్లుగా 2,414 మంది ఎంపికవ్వగా సివిల్‌లో మహిళా కానిస్టేబుళ్లు 993 మంది ఉన్నారు. వీరికి ఈ నెల నుంచి ట్రైనింగ్ మొదలవుతుంది.