News February 19, 2025

గుంటూరు: MDMA వినియోగిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థుల అరెస్ట్ 

image

MDMA నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తూ, వినియోగిస్తున్న 9 మంది ఇంజినీరింగ్ విద్యార్థులను గుంటూరు ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన నితిన్ కాజ గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సాయికృష్ణకు MDMA విక్రయించాడు. ఆ మత్తు పదార్థాలను సాయికృష్ణ గోరంట్లలో ఉంటూ ఇంజినీరింగ్ కళాశాలలకు విక్రయించాడు. మొత్తం 11 మంది ఉండగా 9 మందిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. 

Similar News

News December 9, 2025

గుంటూరు జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు : DEO

image

గుంటూరు జిల్లాలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(APTET) ఈ నెల10 నుంచి 21 వరకు 5 కేంద్రాల్లో జరుగుతుందని DEOసీవీ రేణుక తెలిపారు. పేరేచర్ల యూనివర్సల్ కాలేజ్ (7996), 5వ మైలు ప్రియదర్శిని (9651), నల్లపాడు క్లే క్యాంపస్ టెక్నాలజీస్ ప్రై.లిమిటెడ్(30318), పుల్లడిగుంట మలినేని పెరుమాళ్ళు కాలేజ్(8891), పుల్లడిగుంట మలినేని లక్ష్మయ్య మహిళాకాలేజ్ (1260)లో పరీక్ష జరుగుతుందన్నారు. ఉదయం, సాయంత్రం పరీక్ష ఉంటుందన్నారు.

News December 9, 2025

GNT: నేడు డ్రగ్ స్టోర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు ప్రారంభం

image

మంత్రి సత్య కుమార్ యాదవ్ మంగళవారం రాష్ట్రంలోని డ్రగ్ స్టోర్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. మంగళగిరి ఏపీఐఐసీ 6వ అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాలను ఉదయం 10.30 గంటలకు మంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. ప్రభుత్వం అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు చేస్తుందని అన్నారు.

News December 9, 2025

స్క్రబ్ టైఫస్ మరణాలు సంభవించకుండా చూడాలి: కలెక్టర్

image

జిల్లాలో స్క్రబ్ టైఫస్ మరణాలు సంభవించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ స్క్రబ్ టైఫస్ నివారణ, ముందస్తు జాగ్రత్త చర్యలు, హౌసింగ్, ఉపాధి హామీ పనులు, గ్రామ వార్డు సచివాలయాల సేవలతో సహా పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షా కాలంలో చిగ్గర్ మైట్ కుట్టడం వల్ల ఈ జ్వరాలు వస్తాయని తెలిపారు.