News November 22, 2024

గుంటూరు RRB అభ్యర్థులకు ముఖ్య గమనిక

image

సికింద్రాబాద్లో జరిగే RRB పరీక్షకు గుంటూరు నుంచి హాజరయ్యే అభ్యర్థులకు అన్-రిజర్వుడ్ స్పెషల్ ట్రైన్‌ను నడపనున్నారు. ఈ మేరకు గుంటూరు డీఆర్ఎం రామకృష్ణ గురువారం ప్రకటన విడుదల చేశారు. గుంటూరు- సికింద్రాబాద్ RRB స్పెషల్ ట్రైన్(07171) ఈ నెల 24, 25, 26, 28, 29 తేదీల్లో ఉదయం 8 గంటలకు బయలుదేరి మంగళగిరి, విజయవాడ మార్గంలో ప్రయాణించి సాయంత్రం 4.15కి సికింద్రాబాద్ చేరుకుంటుందని తెలిపారు.

Similar News

News December 14, 2024

అల్లు అర్జున్ విడుదల.. అంబటి ట్వీట్

image

సినీ హీరో అల్లు అర్జున్‌ జైలు నుంచి విడుదల కావడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా మరో ట్వీట్ చేశారు. ‘గురువు ఆజ్ఞ.. శిష్యుడు అమలు.. అల్లు అర్జున్ అరెస్టు.. నా మాట కాదు.. ఇది జనం మాట’! అంటూ అంబటి ఏపీ CM చంద్రబాబు, తెలంగాణ CM రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్‌ను ట్యాగ్ చేశారు. కాగా అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో అంబటి వరుస ట్వీట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

News December 14, 2024

బాపట్లలో దారుణం.. తల్లిదండ్రులను హత్యచేసిన తనయుడు

image

తల్లిదండ్రులను కన్నకొడుకు హత్య చేసిన సంఘటన బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. విజయభాస్కరరావు, సాయి కుమారి అనే దంపతులు అప్పికట్లలో గృహం నిర్మించుకొని నివాసం ఉంటున్నారని ఆస్తుల పంపకంలో విభేదాల గురించి సంబంధించి వీరి కుమారుడు కిరణ్ వారిని దారుణంగా హత్య చేశాడన్నారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సిఉంది. పోలీసులు హత్య జరిగిన ఇంటి వద్ద పహారా కాశారు.

News December 13, 2024

పద్మవ్యూహం నుంచి బయటకు వస్తున్న అర్జునుడికి శుభాకాంక్షలు

image

సినీ హీరో అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. పద్మవ్యూహం నుంచి బయటకి వస్తున్న అర్జునుడికి శుభాకాంక్షలు! అంటూ ఆయన పోస్ట్ చేశారు. కాగా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్ అల్లుఅర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండించారు.