News July 22, 2024
గుంటూరు: TODAY TOP NEWS

*వైసీపీకి మాజీ MLA రాజీనామా
*అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ ఎంట్రీ
*అసెంబ్లీ వద్ద జగన్ ఆగ్రహం
*అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన జగన్
*నరసరావుపేట: 16 బైకులు స్వాధీనం
*వినుకొండ హత్యపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
*జగన్పై మరోసారి ఫైరైన MLA జీవీ
*నగరం: రూ.60 లక్షలు మాయం
*అమెరికాలో తెనాలి వైద్యురాలి మృతి
*అసెంబ్లీకి పసుపు చొక్కాతో మంత్రి లోకేశ్
Similar News
News November 14, 2025
GNT: ‘నెలాఖరు లోపు స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవాలి’

స్మార్ట్ రేషన్ కార్డులను ఈ నెలాఖరులోపు పొందాలని జిల్లా పౌర సరఫరాల అధికారి పి. కోమలి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను సెప్టెంబరు 1 నుంచి సచివాలయాల సిబ్బంది, రేషన్ షాపు డీలర్ల ద్వారా ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 5,36,406 కార్డుదారులకు పంపిణీ పూర్తి అయిందన్నారు. 49,209 కార్డులు పంపిణీ కాకుండా సచివాలయాల వద్ద మిగిలి ఉన్నాయని, లబ్ధిదారులు కార్డులు తీసుకోవాలన్నారు
News November 14, 2025
గుంటూరు మిర్చి యార్డులో ధరలో ఇలా.!

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం 48,406 మిర్చి టిక్కీలు విక్రయానికి వచ్చాయని గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు. ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 47,533 అమ్మకం జరిగాయని ఇంకా యార్డు ఆవరణలో 13,564 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు విధాలుగా నమోదయ్యాయన్నారు.
News November 14, 2025
మాతృ మరణాల నివారణే ప్రధాన లక్ష్యం: కలెక్టర్

గుంటూరు జిల్లాలో మాతృ మరణాలు జరగకుండా అన్ని వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. హైరిస్క్ గర్భిణులను నిరంతరం పర్యవేక్షించి, సకాలంలో వైద్యం అందించాలని సూచించారు. ఆరోగ్య పరీక్షలు, పౌష్టికాహారం, రక్తహీనత నివారణపై అవగాహన కల్పించాలన్నారు. సమష్టిగా కృషి చేసి మాతృ మరణాలు నివారించాలని ఆమె పిలుపునిచ్చారు.


