News August 5, 2024

గుంటూరు: TODAY TOP NEWS

image

* అమరావతిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
* పల్నాడు జిల్లాలో రోడ్డుపై మొసలి కలకలం
* ఉద్దేశపూర్వకంగానే చెత్తకుప్పలో ఫైళ్లు
* మాచర్ల: బీటెక్ విద్యార్థిని సూసైడ్
* మాచవరం: ఇళ్లపై దాడి.. 9 మంది అరెస్ట్
* ఈ నెల 7న బాపట్లకు సీఎం చంద్రబాబు
* పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి ఆయిల్ దొంగలు

Similar News

News September 18, 2024

GNT: దెబ్బతిన్న పంటలపై పెమ్మసాని దృష్టి సారింపు

image

గుంటూరు జిల్లాలో దెబ్బతిన్న పంట పొలాలు, గండిపడ్డ డ్రైన్లు, వాగులు, గుంటూరు ఛానల్ పరివాహక ప్రాంతాలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక దృష్టి సారించారు. మరోసారి ఇలాంటి వరద నష్టం జరగకుండా అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. రూ.808 కోట్ల ప్రతిపాదనలతో కూడిన అంచనాలతో గుంటూరు ఛానల్ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై తొలి అడుగు వేశారు. ఈ మేరకు గుంటూరులో స్పెషల్ ఆఫీసర్ కృష్ణమ నాయుడు పర్యటించారు.

News September 17, 2024

గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల అభ్యర్థులపై TDP కసరత్తు

image

కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై అధికార TDP కసరత్తు చేస్తోంది. దేవినేని ఉమా, ఆలపాటి రాజా, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, కోవెలమూడి రవీంద్ర(నాని), కిలారు నాగ శ్రావణ్, ఎంఎస్ బేగ్ పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన, యువతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యూత్ కోటాలో నాగశ్రావణ్ పేరు బలంగా వినిపిస్తోంది.

News September 17, 2024

పల్నాడు: ప్రమాదవశాత్తు కాలువలో పడి వివాహిత మృతి

image

ద్విచక్ర వాహనంపై వెళుతూ.. ప్రమాదవశాత్తు కాలువలో పడి వివాహిత మృతి చెందిన ఘటన నకరికల్లులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి అతని భార్య శివ కలిసి ద్విచక్ర వాహనంపై బంధువుల ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో కెనాల్ కాలువ కట్టపై వెళ్తుండగా.. కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి ఇద్దరు కాలువలో పడ్డారు. భర్త ఒడ్డు పట్టుకుని బయటకు రాగా, భార్య కాలువలో గల్లంతై మృతి చెందింది.