News August 10, 2024
గుంటూరు: TODAY TOP NEWS
* నేను పార్టీ మారడం లేదు: MLC హనుమంతరావు
* గుంటూరు: భారీగా గంజాయి స్వాధీనం
* చిలకలూరిపేట: వాగులోకి దూసుకెళ్లిన కారు
* హామీలు ఇచ్చినప్పుడు తెలీదా?: నందిగం సురేశ్
* గుంటూరు జిల్లాలో పెరిగిపోతున్న అబార్షన్లు
* గుంటూరు: మహిళా హెడ్ కానిస్టేబుల్‌కు లైంగిక వేధింపులు
* బాపట్ల జిల్లాలో 18 మంది ఎస్ఐల బదిలీలు
Similar News
News September 19, 2024
గుంటూరు: మాది మంచి ప్రభుత్వం: సీఎం
ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అంకిత భావంతో నిర్ణయాలు తీసుకుంటున్న తమ ప్రభుత్వం మంచి ప్రభుత్వమని గురువారం సీఎం చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడమే కాకుండా అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తున్నదన్నారు. 100 రోజుల్లో 100కు పైగా సంక్షేమ పథకాలు అమలు చేసిన మంచి ప్రభుత్వం అన్నారు.
News September 19, 2024
నందిగం సురేశ్‌కు రిమాండ్ పొడిగింపు
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మరో 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా TDP కార్యాలయంపై దాడి కేసులో ఈ నెల 5న సురేశ్‌ను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేయగా, ఆయనను పోలీస్ కస్టడీకి తీసుకొని విచారణ కూడా జరిపారు. బుధవారం తుళ్లూరు పోలీసులు ఓ మర్డర్ కేసులో ఆయనపై పీటీ వారెంట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
News September 19, 2024
గుంటూరు: 100 రోజుల పాలనపై మీ కామెంట్.?
ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ఈ నెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్నక్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని YCP విమర్శిస్తోంది. 100 రోజుల పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్