News August 11, 2024
గుంటూరు: TODAY TOP NEWS
* 15 నుంచి రెవెన్యూ సదస్సులు: అనగాని
* నాగార్జునసాగర్‌కు తగ్గిన వరద.. 16 గేట్ల నుంచి నీరు విడుదల
* జగన్‌పై మహాసేన రాజేశ్ తీవ్ర వ్యాఖ్యలు
* ప్రత్తిపాడు: బాలుడిపై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు
* నాగార్జునసాగర్‌కు పోటెత్తిన పర్యాటకులు
* మాచర్ల: కుటుంబ కలహాలతో వ్యక్తి సూసైడ్
* గుంటూరులో చోరీ.. రూ.2 లక్షలు నగదు అపహరణ
Similar News
News November 29, 2024
ఈనెల 30న మంగళగిరిలో జాబ్ మేళా
ఈనెల 30న మంగళగిరిలోని VJ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. ఈ జాబ్‌మేళాకు 9 కంపెనీలు పాల్గొంటాయన్నారు. 10 నుంచి పీజీ, డిప్లొమా, బీటెక్, ఐఐటీ, ఇంటర్ అభ్యర్థులు అర్హులని చెప్పారు. 19 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చన్నారు. ఎంపికైన వారికి సూమారు రూ.20వేల జీతం ఉంటుందన్నారు.
News November 29, 2024
చేబ్రోలు: బాలికను హత్య చేసిన నిందితుడు అరెస్ట్
చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న శైలజ(13)ను జులై 15వ తేదీన నాగరాజు అనే వ్యక్తి హత్య చేసి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు గత నాలుగు నెలలుగా నాగరాజు కోసం గాలింపు చేపట్టారు. ఈమేరకు గురువారం నిందితుడిని రాజమండ్రి ప్రాంతంలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
News November 29, 2024
నేటి నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు
నేటి నుంచి రానున్న 4 రోజుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో భద్రంగా తెలిపారు. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.