News December 19, 2024

గుంటూరు: YCP నేతలపై కేసు నమోదు

image

YCP కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు, మరికొందరి పార్టీ శ్రేణులపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. YCP నేతలు ఈ నెల 16న అంబటి రాంబాబు, నూరి ఫాతిమా, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, మరికొందరి నేతలు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారన్నారు. పోలీస్ సిబ్బందిని బయటకు వెళ్లనీయకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా నిరసన చేపట్టారని హెడ్ కానిస్టేబుల్ చంగలరాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Similar News

News January 16, 2025

GNT: భారత సైన్యంలో సేవలందించని గడపలు ఆ ఊళ్లో లేవు

image

భారత సైనిక వ్యవస్థలో నిజాంపట్నం మండలం బావాజీపాలెం గ్రామానికి ప్రత్యేక స్థానం ఉంది. గ్రామంలోని 98 శాతం ఇళ్లలో సైనికులు, మాజీ సైనికులు ఉన్నారు. దీంతో బావాజీపాలెం మిలటరీ గ్రామంగా ప్రసిద్ధి చెందింది.1965 చైనా యుద్ధం, 1971 పాకిస్తాన్ యుద్ధం, 1999 కార్గిల్ ఇలా ప్రతి యుద్ధంలో ఈ గ్రామ సైనికులు పాల్గొన్నారు. ఈ గ్రామాన్ని 1978లో భారత ఆర్మీ దత్తతు తీసుకొని గ్రామంలో వాటర్ ట్యాంకు నిర్మించింది.

News January 14, 2025

రేపు గుంటూరు రానున్న బాబీ, తమన్

image

గుంటూరు ఐటీసీ హోటల్ నుంచి మైత్రి మూవీస్ వరకు బుధవారం ఉదయం 10.30 గంటలకు జరగనున్న బైక్ ర్యాలీలో డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొంటారని గుంటూరు బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు బెల్లంకొండ సురేశ్ మంగళవారం తెలిపాడు. అనంతరం బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాను అభిమానులతో బాబీ, తమన్, డిస్టిబూటర్స్ చూడనున్నారని తెలిపారు. ఈ ర్యాలీని బాలయ్య అభిమానులు విజయవంతం చేయాలని కోరారు.

News January 14, 2025

చేనేతలపై అభిమానాన్ని చాటుకున్న మంత్రి లోకేశ్

image

చేనేతలపై అభిమానాన్ని మంత్రి లోకేశ్ మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నారు. సంక్రాంతి పండుగ వేడుకల కోసం కుటుంబంతో సహా నారావారిపల్లె వెళ్లిన లోకేశ్, భార్య బ్రహ్మణికి మంగళగిరి చేనేత చీరను స్పెషల్ గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ఫ్రైజ్ చేశారు. బ్రహ్మణి సంక్రాంతి రోజున మంగళగిరి చీర కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అవకాశం ఉన్న ప్రతిచోట భార్య బ్రహ్మణి మంగళగిరి చేనేతను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు.