News February 11, 2026
గుండారం గుట్టల ప్రాంతంలో పెద్దపులి..?

కోహెడ మండలం నుంచి మల్లారం హైవే దాటి పెద్దపులి బెజ్జంకి మండలంలోని మల్లోని చెరువు గుండారం గుట్టల ప్రాంతంలోకి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే మూడు రోజుల పాటు పశువులను ఇంటి వద్దే కట్టేసుకోవాలని, చీకటి పడే వరకు పొలాల వద్ద ఉండకూడదని హెచ్చరించారు. బెజ్జంకి పోలీసులు కూడా గ్రామస్థులకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ గస్తీని పెంచారు.
Similar News
News March 17, 2026
రెవెన్యూ క్లినిక్‌లతో భూసమస్యల పరిష్కారం: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం భూసమస్యలపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ లు ఉత్తమ ఫలితాలు నిస్తున్నాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ..29 డిసెంబర్, 2025న రెవెన్యూ క్లినిక్‌లు ప్రారంభం నాటి నుంచి మార్చి 16, 2026 వరకు 10 విడతలుగా రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహించడం జరిగిందని తెలిపారు. మొత్తం 461 దరఖాస్తులు అందగా 148 పరిష్కరించామన్నారు.
News March 17, 2026
జహీరాబాద్: స్కూటీ డిక్కీ నుంచి రూ.8 లక్షలు కొట్టేశారు

జహీరాబాద్ తహశీల్దార్ ఆఫీస్ వద్ద మంగళవారం స్కూటీ డిక్కీ నుంచి క్షణాల్లో రూ.8లక్షలు కొట్టేశారు. బాధితుడు నరసింహారెడ్డి భూమి రిజిస్ట్రేషన్ కోసం ఎస్‌బీఐ బ్రాంచ్ నుంచి రూ. 8 లక్షలు డ్రా చేసి స్కూటీ డిక్కీలో పెట్టుకొని కార్యాలయం లోపలికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి దుండగులు నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు నుంచి దుండగులు వెంబడించి ఉంటారని అనుమానిస్తున్నారు.
News March 17, 2026
ప్రచార రథాన్ని ప్రారంభించిన నల్గొండ కలెక్టర్

“ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన” పథకం కింద జిల్లాలో ఎక్కువ మంది లబ్ధిదారులు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన “ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజన” పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి ఏర్పాటుచేసిన ప్రచార రథాన్ని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన మంగళవారం ప్రారంభించారు.


