News February 25, 2025

గుండాల కోనలో శివరాత్రి ఉత్సవాలు నిలిపివేత

image

ఓబులవారిపల్లి మండలం వై. కోట గ్రామం నుంచి రిజర్వు ఫారెస్ట్‌లో గల గుండాల కోనలో శివరాత్రి ఉత్సవాలను అర్ధాంతరంగా నిలిపివేసినట్లు తహశీల్దార్ శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు తొక్కిసలాటలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దారి తప్పిన ఏనుగుల గుంపు ప్రమాదం కలుగజేస్తాయని ముందు జాగ్రత్తగా ఉత్సవాలను నిలిపివేసినట్లు తెలిపారు.

Similar News

News December 9, 2025

గాఢ సేంద్రియ ఎరువులతో ఎక్కువ లాభం

image

స్థూల సేంద్రియ ఎరువుల కంటే నత్రజని, భాస్వరం, పొటాష్‌ వంటి పోషకాలను ఎక్కువగా కలిగి ఉండి నేలకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి. ఉదాహరణ: కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ పిండి, ఆముదపు పిండి, కానుగ పిండి, పత్తి గింజల పిండి, చేపల పొట్టు, ఎముకల పొడి, కొమ్ముల పొడి, వర్మి కంపోస్టు మొదలైనవి. వీటి కొనుగోలు కాస్త ఖర్చుతో కూడుకున్నదైనా నిపుణుల సూచనల మేరకు వీటిని వినియోగిస్తే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది.

News December 9, 2025

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.. మంత్రి విచారం వ్యక్తం

image

నగరి(M) తడుకుపేట సమీపంలో రెండు కార్లు ఢీకొని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి మండిపల్లి స్పందించారు. ఘటన బాధాకరమని, సంతాపం వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతపై ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News December 9, 2025

పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్?

image

వ్యాపారవేత్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో హీరోయిన్ నివేదా పేతురాజ్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరి వివాహం రద్దయినట్లు ప్రచారం జరుగుతోంది. తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి ఎంగేజ్మెంట్ పోస్ట్‌ను తొలగించడం, ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇటీవలే క్రికెటర్ స్మృతి మంధాన వివాహం కూడా ఎంగేజ్మెంట్ తర్వాత రద్దయింది.