News March 3, 2025
గుండుగొలను: రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి

బాపులపాడు మండలంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. ఏలూరు జిల్లా గుండుగొలనుకి చెందిన నాగరాజు కుటుంబం బైక్పై గుడివాడ వెళ్తుండగా ఆరుగొలను వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలతో ఉన్న క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 5, 2025
కామారెడ్డిలో పర్యటించిన బీజేపీ జిల్లా ఇన్ఛార్జి

కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ జిల్లా ఇన్ఛార్జి విక్రమ్ రెడ్డిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లాకు మొదటిసారిగా వచ్చిన ఆయనకు జిల్లాలో బీజేపీ సంస్థాగత వివరాలను వివరించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతపై, నాయకత్వం గురించి తెలిపారు. BJP సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, పైడి ఎల్లారెడ్డి, హైమారెడ్డి, BJP నాయకులు పాల్గొన్నారు.
News December 5, 2025
PHOTO GALLERY: మెగా పేరెంట్ టీచర్ మీటింగ్

AP: రాష్ట్రంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ విజయవంతంగా ముగిసింది. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. పిల్లలకు పాఠాలు చెప్పి అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో ఫొటోలు దిగారు. అటు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
News December 5, 2025
పండ్లు, కూరగాయలు తినే ముందు ఇది గుర్తుంచుకోండి

వ్యవసాయంలో అధిక దిగుబడి, చీడపీడల నివారణ కోసం ఈ మధ్యకాలంలో పంటలపై క్రిమిసంహారకాలు, కలుపు మందుల వాడకం ఎక్కువైంది. పంటకాలం పూర్తై, విక్రయించిన తర్వాత కూడా పురుగు మందుల అవశేషాలు పండ్లు, కూరగాయల నుంచి తొలగిపోవు. అందుకే మనం తినే ముందు వీటిని తప్పనిసరిగా శుభ్రం చేసి తినాలి. లేకుంటే ఈ అవశేషాలు ఎక్కువ కాలం శరీరంలోకి చేరితే క్యాన్సర్, గుండె జబ్బులు, అంగ వైకల్యం లాంటి సమస్యలు తలెత్తే ఛాన్సుంది.


