News February 4, 2025
గుండుమాల్: చిరుత పులి దాడిలో లేగ దూడ మృతి

గుండుమాల్ మండల పరిధిలో సోమవారం రాత్రి గుండుమాల్ గ్రామానికి చెందిన గుడిసె కుర్మయ్య పొలం దగ్గర చిరుత పులి దాడి చేయడంతో లేగ దూడ మృతి చెందింది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు రైతులు తెలిపారు. అధికారులు స్పందించి రైతు కుర్మయ్యకు న్యాయం చేయడంతో పాటు చిరుతను బంధించి తమను ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. కొత్తపల్లి మండలంలో మరో చిరుతను అటవీశాఖ అధికారులు గుర్తించారు.
Similar News
News November 6, 2025
ఉండ్రాజవరం: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో దువ్వాపు జయరాం (25) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ప్రేమించిన యువతి తన ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
News November 6, 2025
బెదిరింపు కాల్స్ వస్తే సమాచారం ఇవ్వండి: ఎస్పీ శబరిశ్

సైబర్ మోసగాళ్ల నుంచి వచ్చే బెదిరింపు కాల్స్, డిజిటల్ అరెస్టుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు ఎస్పీ శబరిశ్ సూచించారు. ఇటీవల ములుగులోని ఓ మెడికల్ షాపు యజమానికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి, తాము డ్రగ్స్ ఇన్స్పెక్టర్లమని బెదిరించిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అనుమానిత వ్యక్తుల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ఎవరికైనా బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలన్నారు.
News November 6, 2025
సిరిసిల్ల: ‘రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు’

సరైన తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సిరిసిల్ల ఇన్ఛార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్ కేంద్రాల నిర్వాహకులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.


