News February 4, 2025
గుండుమాల్: చిరుత పులి దాడిలో లేగ దూడ మృతి

గుండుమాల్ మండల పరిధిలో సోమవారం రాత్రి గుండుమాల్ గ్రామానికి చెందిన గుడిసె కుర్మయ్య పొలం దగ్గర చిరుత పులి దాడి చేయడంతో లేగ దూడ మృతి చెందింది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచారిస్తున్నట్లు రైతులు తెలిపారు. అటవీశాఖ అధికారులు స్పందించి రైతు కుర్మయ్యకు న్యాయం చేయడంతో పాటు చిరుత జాడను కనుక్కోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. కొత్తపల్లి మండలంలో మరో చిరుతను అటవీశాఖ అధికారులు గుర్తించారు.
Similar News
News March 15, 2025
యాదాద్రి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి (UPDATE)

యాదాద్రి జిల్లా ఆత్మకూర్ఎం మండల కేంద్రంలోని రాయగిరి-మోత్కూరు ప్రధాన రహదారిపై తిమ్మాపురం క్రాస్ రోడ్డు వద్ద <<15765722>>రోడ్డుప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తిమ్మాపురం గ్రామానికి చెందిన రమేష్ (34) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 15, 2025
తగ్గిన బంగారం ధరలు

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితితో నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాదులో 24K గోల్డ్ 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.89,670 వద్ద కొనసాగుతోంది. ఇక 22K 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.82,200 వద్దకు చేరుకుంది. వెండి కిలో రూ.1,12,000 వద్ద యథాతథంగా ట్రేడవుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.27,780 వద్ద ఉంది.
News March 15, 2025
రైతు రుణమాఫీపై సభలో మాటల యుద్ధం

TG: అసెంబ్లీలో రైతు రుణమాఫీపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీనిపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. సగం మందికి కూడా మాఫీ జరగలేదన్నారు. దీంతో రైతుల వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ జిల్లాల వారీగా ఎన్నికోట్ల మాఫీ జరిగిందో భట్టి చదివి వినిపించారు.