News February 4, 2025
గుండుమాల్: చిరుత పులి దాడిలో లేగ దూడ మృతి

గుండుమాల్ మండల పరిధిలో సోమవారం రాత్రి గుండుమాల్ గ్రామానికి చెందిన గుడిసె కుర్మయ్య పొలం దగ్గర చిరుత పులి దాడి చేయడంతో లేగ దూడ మృతి చెందింది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు రైతులు తెలిపారు. అటవీశాఖ అధికారులు స్పందించి రైతు కుర్మయ్యకు న్యాయం చేయడంతో పాటు చిరుత జాడను కనుక్కోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. కొత్తపల్లి మండలంలో మరో చిరుతను అటవీశాఖ అధికారులు గుర్తించారు.
Similar News
News January 20, 2026
పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ

కదిరి సబ్ డివిజన్ పరిధిలోని తనకల్లు, తలుపుల, ఎన్పీకుంట పోలీస్ స్టేషన్లను SP సతీశ్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్ల పనితీరు, కేసుల దర్యాప్తు విధానాలపై అధికారులతో సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల స్థితిగతులు, రిజిస్టర్లను పరిశీలించారు. నేరాల నియంత్రణపై అధికారులకు పలు సూచనలు చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
News January 20, 2026
నల్గొండ: B.P.Ed, D.P.Ed పరీక్షల షెడ్యూల్ విడుదల

ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మ గాంధీ యూనివర్సిటీ పరిధిలో B.P.Ed, D.P.Ed సెమిస్టర్-1 రెగ్యులర్‌కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. ఫిబ్రవరి-4 నుంచి ఫిబ్రవరి-11 మధ్య పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.
News January 20, 2026
సభలో కూర్చున్నప్పుడే MPల అటెండెన్స్: స్పీకర్

లోక్‌సభ సభ్యుల అటెండెన్సును వారు సభలో కూర్చున్నప్పుడే తీసుకోనున్నామని స్పీకర్ ఓం బిర్లా మీడియాకు తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు హౌస్ బయట హాజరు వేసే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే సభ ముగిసిన, ఏదైనా కారణంతో అర్థాంతరంగా వాయిదా పడిన తర్వాత హాజరు వేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. హాజరు నమోదుకు సభ్యుల సీట్ల వద్ద కన్సోల్ పరికరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


