News December 30, 2024
గుండెపోటుతో అనంతపురం వైసీపీ నేత మృతి

అనంతపురం జిల్లా పార్లమెంట్ వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్, అధ్యక్షుడు ప్రవీణ్ సాయి విఠల్ గుండెపోటుతో మరణించారు. నిన్న రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. విఠల్ మృతిపై వైసీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. పార్టీ కోసం నిరంతరం కష్టపడే ప్రవీణ్ సాయి విఠల్ మృతి చాలా బాధాకరమని వైసీపీ ట్వీట్ చేసింది. అతని ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంది.
Similar News
News October 17, 2025
వైసీపీని బలోపేతం చేయడానికి కమిటీల నియామకం: అనంత వెంకటరామిరెడ్డి

వైసీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి డివిజన్ స్థాయిలో కమిటీల నియామకం చేపడుతున్నట్లు వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. గురువారం అనంతపురం నగరంలోని కోర్టు రోడ్డులోని తన క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు, వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. కమిటీల నియామకం, ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణపై అనంత దిశా నిర్దేశం చేశారు.
News October 15, 2025
పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలి: కలెక్టర్

అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న పర్యాటక ప్రదేశాలను మరింతగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. భావితరాలకు మన దేశ వారసత్వం, పురాతన కట్టడాల గురించి తెలపాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు.
News October 15, 2025
ఈనెల 17 నుంచి జిల్లాస్థాయి సైన్స్ సెమినార్

అనంతపురం జిల్లాలో ప్రభుత్వ, జడ్పీ మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఈనెల 17 నుంచి జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ నిర్వహిస్తున్నట్లు డీఈవో ప్రసాద్ బాబు, సైన్స్ సెంటర్ క్యూరేటర్ బాల మురళీకృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం మండల స్థాయిలో సెమినార్ నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తామన్నారు.