News March 17, 2025
గుండెపోటుతో ఆదివాసీ నాయకుడు మృతి

ఆళ్లపల్లి మండలం, మర్కోడు పంచాయితీ జిన్నెలగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ నాయకుడు కొమరం నరసింహారావు సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. నరసింహారావు వ్యవసాయం చేస్తూ, ఆదివాసీల అభివృద్ధి కోసం క్రియాశీలపాత్ర పోషించాడు. ఆయన మృతి విషయం తెలుసుకున్న పలువురు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
Similar News
News October 22, 2025
కార్తీక మాసం.. భారీగా తగ్గనున్న చికెన్ ధరలు

నేటి నుంచి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమైంది. చాలామంది మాంసాహారం ముట్టకుండా శివుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. దీంతో చికెన్ రేట్లు భారీగా తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి కేజీ కోడి మాంసం ధర రూ.210 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. 2,3 రోజుల్లో రేట్లు తగ్గడం ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. కేజీ చికెన్ ధర రూ.170-180కి రావొచ్చని అంటున్నారు.
News October 22, 2025
సత్య నాదెళ్లకు రూ.846 కోట్ల జీతం

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం భారీగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన ప్యాకేజీ అంతకుమందు ఏడాదితో పోలిస్తే 22% అధికమైంది. ప్రస్తుతం ఆయన ఏడాదికి 96.5 మి.డాలర్ల (రూ.846 కోట్లు) జీతం అందుకుంటున్నారు. సత్య నాదెళ్ల, ఆయన లీడర్షిప్ టీమ్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మైక్రోసాఫ్ట్ పురోగతి సాధించిందని కంపెనీ బోర్డు తెలిపింది. అలాగే షేర్ల ధరలు పెరిగాయని పేర్కొంది.
News October 22, 2025
విశాఖలోనే మొదటి రీజినల్ ల్యాబ్

రాష్ట్రంలోని విశాఖలోనే తొలిసారిగా రీజినల్ ల్యాబ్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. బుధవారం విశాఖ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఫుడ్ సేఫ్టీ శాఖలో సిబ్బంది కొరత ఉందని తెలిపారు. సచివాలయాల్లో ప్రతిభగల వారిని ఈ శాఖలోకి తీసుకువచ్చేందుకు అవకాశాలు పరిశీలిస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చిస్తామని వెల్లడించారు.