News March 17, 2025

గుండెపోటుతో ఆదివాసీ నాయకుడు మృతి

image

ఆళ్లపల్లి మండలం, మర్కోడు పంచాయితీ జిన్నెలగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ నాయకుడు కొమరం నరసింహారావు సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. నరసింహారావు వ్యవసాయం చేస్తూ, ఆదివాసీల అభివృద్ధి కోసం క్రియాశీలపాత్ర పోషించాడు. ఆయన మృతి విషయం తెలుసుకున్న పలువురు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

Similar News

News July 6, 2025

ఆ సమయంలో 9 రోజులు అన్నం ముట్టను: హీరోయిన్

image

తాను ఏడాదికి రెండు సార్లు ఉపవాసం ఉంటానని హీరోయిన్ నర్గీస్ ఫక్రీ తెలిపారు. ఆ సమయంలో 9 రోజులపాటు ఏమీ తిననని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ఉపవాసం చేసినన్ని రోజులు నీళ్లు తాగే బతుకుతా. ఫాస్టింగ్ అయిపోయేసరికి ముఖం వికృతంగా మారుతుంది. కానీ ముఖంలో కాస్త గ్లో ఉంటుంది. ఉపవాసం అయిపోయాక హై ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటా’ అని చెప్పుకొచ్చారు. కాగా నర్గీస్ ఇటీవల విడుదలైన ‘హౌస్‌ఫుల్ 5‘ సినిమాతో ప్రేక్షకులను అలరించారు.

News July 6, 2025

ధర్మపురి : ‘పనుల నాణ్యతపై రాజీ ఉండకూడదు’

image

పనుల నాణ్యతపై రాజీ ఉండకూడదని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం ధర్మపురిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న గదులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. వైద్య సేవలు, శుభ్రతపై సమీక్షించి, అత్యవసర పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. కేంద్రం పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

News July 6, 2025

ధర్మపురి : ‘ప్రమాదకర గదులను వెంటనే కూల్చండి’

image

ప్రమాదకర గదులు వెంటనే కూల్చాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ధర్మపురి మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించిన ఆయన.. ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. గదుల స్థితి దారుణంగా ఉండటాన్ని గమనించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సానిటేషన్ పనులపై సమీక్షించి, డ్రైనేజీలు, కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలన్నారు. వర్షాలు అధికంగా కురిసే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.