News October 28, 2024
గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామ్మోహన్(47) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు. రామ్మోహన్ బ్రహ్మసముద్రం మండలం రాయలదొడ్డిలోని జడ్పీ పాఠశాలలో తెలుగు టీచర్‌గా పని చేస్తూ, కళ్యాణదుర్గంలో నివాసముంటున్నారు. స్నానానికి వెళ్లే సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రామ్మోహన్ మృతి చెందినట్లు నిర్ధారించారు.
Similar News
News November 4, 2024
అనంతపురం జిల్లాలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ వీరికే!
అనంతపురం జిల్లాలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు 5,05,831 మంది అర్హత సాధించారు. వీరికి ప్రభుత్వం ఏడాదికి మూడు సిలిండర్లను అందజేస్తుంది. జిల్లాలో 1,61,437 మంది దీపం-2 పథకానికి అనర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఆధార్, రేషన్ కార్డు ప్రామాణికంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. లబ్ధిదారులకు సందేహాలుంటే 1967 నంబరుకు ఫోన్ చేయొచ్చు. ఇప్పటికే ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
News November 4, 2024
అనంత: హాకీ నేషనల్ ఛాంపియన్ షిప్‌కు జస్వంత్, చంద్రమౌళి ఎంపిక
ఈ నెల 4 నుంచి 16వ తేదీ వరకు చెన్నైలో నిర్వహించే హాకీ ఇండియా సీనియర్ మెన్ నేషనల్ ఛాంపియన్ షిప్‌కు ఏపీ తరఫున అనంతపురం జిల్లాకు చెందిన జస్వంత్, చంద్రమౌళి ఎంపికయ్యారు. ఆదివారం అనంతపురంలో జిల్లా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్.అనిల్ కుమార్ మాట్లాడారు. నేషనల్ చాంపియన్ షిప్‌కు జిల్లా క్రీడాకారులు ఎంపికవ్వడం అభినందనీయం అన్నారు.
News November 4, 2024
హిందూపురంలో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్
హిందూపురంలో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఉత్తర్వులు జారీ చేశారు. చిలమత్తూరు మండలంలో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పాత నేరస్థులు హిందూపురానికి చెందిన వారు పోలీసుల విచారణలో పలు అంశాలను వెల్లడించారు. నేరస్థులకు సహకరించిన కానిస్టేబుళ్లు నరేశ్, వెంకటరామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదివారం రాత్రి ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.