News July 14, 2024
గుండెపోటుతో గొల్లప్రోలు ASI మృతి
కాకినాడ జిల్లా గొల్లప్రోలు పోలీస్ స్టేషన్‌లో ASIగా విధులు నిర్వహిస్తున్న జి.కృష్ణారావు(59) గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం కృష్ణారావుకు గుండెపోటు రావడంతో కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణ వార్త విని తోటి అధికారులు, సిబ్బంది భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Similar News
News October 13, 2024
అడ్డతీగల: వెల్లుల్లి ధర అదరహో
ఏజెన్సీ ప్రాంతం అయిన అడ్డతీగల పరిసర గ్రామాల్లో వెల్లుల్లి ధర గణనీయంగా పెరిగింది. నాణ్యమైనవి పెద్దవి 15రోజుల క్రితం కిలో రూ.300 పలుకగా నేడు రూ.400కి పెరిగింది. పంట తగ్గడంతో గిరాకీ పెరిగి రేటు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతానికి రాజమండ్రి నుంచి వీటిని వ్యాపారులు తీసుకొచ్చి విక్రయాలు జరుపుతారు. కూరగాయలు రేటు కూడా పెరగడం వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.
News October 13, 2024
కోనసీమ: డీజే సౌండ్‌కు యువకుడి మృతి
కోనసీమ జిల్లాలో దసరా ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అమలాపురం మండలం కొంకాపల్లిలో శనివారం రాత్రి డీజే సౌండ్‌కు వినయ్ అనే యువకుడు డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించే క్రమంలో మరణించాడు. దీనితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవల కాలంలో డీజే సౌండ్‌కు పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. వినయ్ హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.
News October 13, 2024
అమలాపురం: ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఎంపికపై సర్వే
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందన్న అంశంపై ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా సర్వే చేపట్టారు. అమలాపురం టీడీపీ యువ నాయకుడు చెరుకూరి సాయిరామ్, ముమ్మిడివరానికి చెందిన పేరాబత్తుల రాజశేఖర్, అమలాపురం టీడీపీ సీనియర్ నాయకుడు రమణబాబు, వాసంశెట్టి వెంకట సత్య ప్రభాకర్, జిల్లాకు చెందిన పలువురు నాయకులు పేర్లపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.