News February 4, 2025
గుండెపోటుతో జన్నారం అదనపు ఎస్సై మృతి
మంచిర్యాల జిల్లా జన్నారం మండల అదనపు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ నాయక్ (60) గుండెపోటుతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తానాజీ నాయక్ సొంత గ్రామం ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం ఏంద గ్రామం. ప్రస్తుతం జన్నారం మండలం ఇంధన్ పల్లిలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. తానాజీ మృతి పట్ల లక్షెట్టిపేట సీఐ నరేందర్, జన్నారం ఎస్ఐ రాజవర్ధన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
Similar News
News February 4, 2025
ఫోర్బ్స్ టాప్-10 దేశాల్లో ఇండియాకు నో ప్లేస్
ఫోర్బ్స్ ప్రకటించిన టాప్-10 శక్తివంతమైన దేశాల జాబితాలో ఇండియాకు చోటు దక్కలేదు. నాయకత్వం, ఆర్థిక ప్రభావం, రాజకీయ శక్తి, బలమైన విదేశీ సంబంధాలు, సైనిక శక్తి ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. ఇందులో అమెరికా, చైనా, రష్యా, యూకే, జర్మనీ, సౌత్ కొరియా, ఫ్రాన్స్, జపాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాలకు టాప్-10లో చోటు దక్కింది. భారత్ 12వ స్థానంలో ఉంది.
News February 4, 2025
ప్రకృతి వ్యవసాయ పొలాలను పరిశీలించిన కలెక్టర్
నంద్యాల మండలం పాండురంగాపురంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తున్న రైతుల పొలాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మంగళవారం గ్రామంలోని మధుసూదన్ రెడ్డి, కేశవ్ రెడ్డి పొలాలను పరిశీలించి, వారు అవలంభిస్తున్న విధానాలను సమీక్షించారు. రైతులతో నేరుగా మాట్లాడి, వారి అనుభవాలను స్వయంగా తెలుసుకున్నారు. రైతులు తమ అనుభవాలను పంచుకుంటూ రసాయన రహిత సాగుతో వచ్చిన లాభాలను కలెక్టర్‌కు వివరించారు.
News February 4, 2025
రూ.3 కోట్లతో గర్ల్‌ఫ్రెండ్‌కు ఇల్లు కట్టించిన దొంగ
షోలాపూర్‌కు చెందిన ఓ దొంగ తన గర్ల్ ఫ్రెండ్‌కు రూ.3 కోట్లు వెచ్చించి ఇల్లు నిర్మించాడు. పంచాక్షరి స్వామి(37) మైనర్‌గా ఉన్నప్పటి నుంచే దొంగతనాలు చేస్తున్నాడు. ఇళ్లలో బంగారం దొంగిలించి వాటిని కరిగించి బిస్కెట్లుగా మారుస్తాడు. ఈక్రమంలో నటితో పరిచయం చేసుకుని దగ్గరయ్యాడు. దొంగిలించిన డబ్బుతో కోల్‌కతాలో రూ.3 కోట్లు వెచ్చించి ఇల్లు నిర్మించాడు. ఓ కేసులో బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయగా ఈ విషయం వెల్లడైంది.