News February 4, 2025
గుండెపోటుతో జన్నారం అదనపు ఎస్సై మృతి

మంచిర్యాల జిల్లా జన్నారం మండల అదనపు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ నాయక్ (60) గుండెపోటుతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తానాజీ నాయక్ సొంత గ్రామం ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం ఏంద గ్రామం. ప్రస్తుతం జన్నారం మండలం ఇంధన్ పల్లిలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. తానాజీ మృతి పట్ల లక్షెట్టిపేట సీఐ నరేందర్, జన్నారం ఎస్ఐ రాజవర్ధన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
Similar News
News February 7, 2026
ANU: పీజీ ఆర్ట్స్, సైన్స్, లా పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత నవంబర్ నెలలో జరిగిన పలు పీజీ కోర్సుల మూడో సెమిస్టర్, లా కోర్సుల పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శనివారం తెలిపారు. రీవాల్యుయేషన్ కు దరఖాస్తులు ఈనెల 16వ తేదీలోగా అందించాలని సూచించారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in సంప్రదించాలన్నారు.
News February 7, 2026
ఇంటర్ పరీక్షలను పటిష్ఠంగా నిర్వహించాలి: కలెక్టర్

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠంగా నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News February 7, 2026
విశాఖకు 100 ఎలక్ట్రిక్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

విశాఖ ఐటీ హిల్స్‌కు వెళ్లే ఉద్యోగుల కోసం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం మద్దిలపాలెం డిపోలో అదనంగా రెండు ప్రత్యేక బస్సులను ప్రారంభించారు. అలాగే జిల్లాకు 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించినట్లు వెల్లడించారు. ‘స్త్రీ శక్తి’ ఉచిత ప్రయాణ పథకం అమలులో విశాఖ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, ఉత్తమ సేవలు అందించిన ఆర్టీసీ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశామన్నారు.


