News February 4, 2025

గుండెపోటుతో జన్నారం అదనపు ఎస్సై మృతి

image

మంచిర్యాల జిల్లా జన్నారం మండల అదనపు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ నాయక్ (60) గుండెపోటుతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తానాజీ నాయక్ సొంత గ్రామం ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం ఏంద గ్రామం. ప్రస్తుతం జన్నారం మండలం ఇంధన్ పల్లిలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. తానాజీ మృతి పట్ల లక్షెట్టిపేట సీఐ నరేందర్, జన్నారం ఎస్ఐ రాజవర్ధన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Similar News

News January 18, 2026

VJA: పెళ్లి సంబంధం ఇష్టంలేదని కాలువలో దూకేశాడు..!

image

పేరెంట్స్ చూసిన పెళ్లి సంబంధం నచ్చలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు కాలువలోకి దూకిన ఘటన కలకలం రేపింది. పటమట దర్శిపేటకు చెందిన యువకుడికి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ఈ నెల 16న పెళ్లి చూపులకు వెళ్లారు. అయితే ఆ సంబంధం ఇష్టం లేని యువకుడు.. శనివారం సాయంత్రం యనమలకుదురు పాత వంతెన వద్ద తన ఫోన్ పక్కన పడేసి కాలువలోకి దూకాడు. సమాచారం అందుకున్న NDRF బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇంకా ఆచూకీ తెలియలేదు.

News January 18, 2026

నేటి నుంచి నాగోబా జాతర

image

TG: దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన ఆదిలాబాద్(D) కేస్లాపూర్ నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. పుష్యమాస అమావాస్య సందర్భంగా ఇవాళ 10pmకు మహాపూజలతో అంకురార్పణ చేయనున్నారు. మెస్రం వంశీయులు మంచిర్యాల(D)లోని హస్తిన మడుగు నుంచి కాలినడకన సేకరించిన గోదావరి జలంతో నాగోబాకు అభిషేకం చేసి, 7 రకాల నైవేద్యాలు సమర్పించడంతో జాతర ప్రారంభం అవుతుంది. 22న గిరిజన దర్బార్, 25వ తేదీతో జాతర ముగియనుంది.

News January 18, 2026

చిత్తూరు జిల్లాలో భారీగా మద్యం అమ్మకాలు

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో రూ.15 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది కంటే ఇది 34% ఎక్కువ. సాధారణంగా జిల్లాలో రోజుకు రూ.కోటి వరకు మద్యం విక్రయాలు జరుగుతాయి. న్యూ ఇయర్ పురస్కరించుకొని రికార్డు స్థాయిలో రూ.14 కోట్ల మద్యం విక్రయాలు జరిగిన సంగతి తెలిసిందే. పండుగల వేళ భారీగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.