News February 13, 2025

గుండెపోటుతో మార్కెట్ కమిటీ కార్యదర్శి మృతి

image

బిక్కనూర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి నరసింహులు (55) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాత రాజు చెప్పారు. స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న నరసింహులు అకాల మరణం పట్ల మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, అఖిలపక్ష నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Similar News

News March 23, 2025

ఎన్నికల్లో కపట హామీలు.. గెలిచాక ఊసే ఉండదు: వైసీపీ

image

AP: చంద్రబాబు 40 ఏళ్లుగా మోసపూరిత రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నారని YCP విమర్శించింది. ఎన్నికల్లో కపట హామీలు ఇచ్చి గెలిచాక వాటి ఊసే ఎత్తని సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపింది. వాలంటీర్లు, ఏపీ అప్పు, సూపర్ 6, భృతి, ఉచిత బస్సు, పోలవరం విషయంలో మోసం చేశారని ఆరోపించింది. ఇప్పటికే మండలిలో ప్రభుత్వాన్ని YCP ప్రశ్నిస్తోందని, శాసనసభలోనూ ప్రతిపక్ష హోదా ఇస్తే మరింత నిలదీస్తారని CBN భయపడుతున్నారని పేర్కొంది.

News March 23, 2025

IPL చరిత్రలో ఆర్చర్ చెత్త రికార్డ్

image

IPL-2025లో RR బౌలర్ జోఫ్రా ఆర్చర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఇవాళ ఉప్పల్‌‌లో SRHతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 76 పరుగులు ఇచ్చారు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఓ స్పెల్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మారారు. మరోవైపు ఇదే మ్యాచ్‌లో తీక్షణ(52), సందీప్ శర్మ(51) ధారాళంగా పరుగులు ఇచ్చారు. అలాగే ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు(46) నమోదైన మ్యాచ్‌గానూ రికార్డ్ సృష్టించింది.

News March 23, 2025

హెచ్చరిక: అలా చేస్తే ఇక లైసెన్స్ రద్దు?

image

TG: తరచూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వాహనదారులకు షాక్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వాటిని మళ్లీ పునరుద్ధరించకపోవడమే కాక వారి వాహనాల రిజిస్ట్రేషన్లు కూడా చేయబోమని పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వం ఈ నిబంధనను అమలుచేయనున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!