News April 12, 2025

గుండెపోటుతో మొగుళ్లపల్లి ఎంపీడీఓ మృతి

image

ఎంపీడీఓగా విధులు నిర్వర్తిస్తున్న మహబూబ్ హుస్సేన్ గుండెపోటుతో మృతి చెందారు. పదిహేనేళ్లుగా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి ఇటీవల ఎంపీడీఓగా బాధ్యతలు తీసుకున్నారు. మేలో పదవీ విరమణ ఉండగా ఇలా జరగడం చాలా బాధాకరమని ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు విచారం వ్యక్తం చేశారు.

Similar News

News November 4, 2025

GNT: మోటార్ వాహనాలకు దివ్యాంగుల నుంచి దరఖాస్తులు

image

దివ్యాంగులకు రెట్రో ఫిట్టేడ్ మోటరైజ్డ్ వాహనాలు మంజూరుకు ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దివ్యాంగుల సంక్షేమ శాఖ డీ.డీ దుర్గాబాయి తెలిపారు. వంద శాతం సబ్సీడీతో ఈ వాహనాలు అందించడం జరుగుతుందని చెప్పారు. www.apdascac.ap.gov.inలో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. దివ్యాంగుల స్వతంత్ర చలనశీలత, ఆత్మ నిర్భరత, సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని తెలిపారు.

News November 4, 2025

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు 2రోజులు సెలవులు

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు ప్రకటించామని మార్కెట్ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం తెలిపారు. రేపు కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి, ఎల్లుండి రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ సమ్మే ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేటు కొనుగోళ్లతో పాటు సి.సి.ఐ కొనుగోళ్లను నిలుపుదల చేస్తున్నట్లు వారు తెలిపారు. రైతులు తేమలేని పత్తిని మాత్రమే తీసుకురావాలన్నారు.

News November 4, 2025

BREAKING: జూబ్లీపోరులో BJPకి జనసేన సపోర్ట్

image

జూబ్లీహిల్స్ బైపోల్ వేడి తారస్థాయికి చేరింది. బీజేపీకి జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్‌గౌడ్ భేటీ అయ్యి, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తమ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా జనసేన నాయకులు ప్రచారంలో పాల్గొననున్నట్లు ఇరు పార్టీలు వెల్లడించాయి.