News March 5, 2025

గుండెపోటుతో యువకుడి మృతి..! 

image

గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన సత్తుపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని గంగారం గ్రామానికి చెందిన గజవెల్లి ప్రేమ్ సాగర్(సుబ్బు) అన్నం తిన్న తరువాత ఛాతిలో నొప్పి వస్తుందని కుప్పకూలాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News March 24, 2025

‘రాజీవ్ యువ వికాసం పథకాన్ని స్వదినియోగం చేసుకోండి’

image

ఏప్రిల్ 5లోపు రాజీవ్ యువ వికాసం పథకానికి బీసీ, ఈబీసీ, EWS నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి జ్యోతి తెలిపారు. జిల్లాలోని వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిందని, దీనిని సద్వనియోగం చేసుకోవాలని కోరారు.

News March 24, 2025

విద్యార్థిని తండ్రి నిర్ణయం.. అధికారులను కదిలించింది..

image

ఓ విద్యార్థిని తండ్రి పట్టుదల కారణంగా ఓ స్కూల్‌ మూతపడకుండా నడుస్తోంది. వైరా మం. నారపునేనిపల్లి స్కూల్‌లో కోతుల బెడద, ఇతర కారణాలతో విద్యార్థులు వెళ్లిపోయారు. దీంతో స్కూల్‌ మొత్తంలో నాలుగో తరగతి విద్యార్థి కీర్తన మాత్రమే మిగిలింది. అధికారులు స్కూల్‌ను మూసివేసేందుకు యత్నించగా.. తన కుమార్తె చదువు మాన్పిస్తానని కీర్తన తండ్రి అనిల్‌శర్మ చెప్పారు. ఇందుకు అధికారులే బాధ్యత వహించాలనడంతో వెనక్కి తగ్గారు.

News March 24, 2025

KTDM: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా..?

image

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో భద్రాచలం BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు పడుతుందా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. భద్రాచలంలో ఉప ఎన్నికలు జరుగుతాయా అని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?

error: Content is protected !!