News January 29, 2025

గుండెపోటుతో విద్యార్థిని మృతి

image

గుండెపోటుతో విద్యార్థిని మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రేగులచలకలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఈ నెల 26న శ్రావణి స్కూల్‌లోనే అస్వస్థతకు గురైంది. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మంగళవారం కన్నుమూసింది. శ్రావణి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.

Similar News

News February 9, 2025

రోజుకు 2-3 గంటలే నిద్రపోతా: సల్మాన్ ఖాన్

image

తాను రోజుకు 2-3 గంటలే నిద్రపోతానని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తెలిపారు. నెలలో 2-3 సార్లు మాత్రమే 7-8 గంటలు నిద్రపోతానని తన తమ్ముడి కొడుకు అర్హాన్ ఖాన్ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. ‘షూటింగ్ గ్యాప్‌లో కూడా చిన్న కునుకు తీస్తా. విమానం కుదుపులకు గురైనా హాయిగా నిద్రపోతా. జైలులో ఉన్నప్పుడు మాత్రం నిద్రకు ఎక్కువ సమయం కేటాయించా’ అని చెప్పుకొచ్చారు. కాగా సల్మాన్ ప్రస్తుతం ‘సికందర్’ సినిమాలో నటిస్తున్నారు.

News February 9, 2025

జనగామ: వసతి గృహాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

image

జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ రైల్వే ట్రాక్ పరిధిలో గల ఎస్సీ బాలుర వసతి గృహాన్ని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి అయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, రాత్రి అక్కడే బస చేయనున్నారు.

News February 9, 2025

SA20 టోర్నీ విజేతగా MI కేప్‌టౌన్

image

SA20-2025 టైటిల్‌ను MI కేప్‌టౌన్ గెలుచుకుంది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన ఫైనల్‌లో 76 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత MI 181-8 స్కోర్ చేయగా, ఛేదనలో తడబడిన సన్‌రైజర్స్ 105 పరుగులకే పరిమితమైంది. ఈ టోర్నీ చరిత్రలో MIకి ఇదే తొలి టైటిల్. కాగా తొలి రెండు సీజన్లలో సన్ రైజర్స్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!