News December 28, 2024

గుండెపోటుతో MLC రామచంద్రయ్య కుమారుడి మృతి

image

కడప జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కుమారుడు విష్ణు స్వరూప్ గుండెపోటుతో మృతి చెందారు. మధ్యాహ్నం గుండె పోటుకు గురికాగా హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో రామచంద్రయ్య ఇంట్లో విషాదం నెలకొంది. 

Similar News

News September 13, 2025

రూ.1.91 కోట్లు పలికిన ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ టెండర్

image

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ నిర్వహణను బాక్స్ టెండర్‌లో రూ.1.91,44,000లకు శివకుమార్ దక్కించుకున్నాడు. శుక్రవారం ప్రొద్దుటూరులోని మున్సిపల్ కార్యాలయంలో ఎగ్జిబిషన్ టెండర్లను కమిషనర్ రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు నిర్వహించారు. ఓపెన్, బాక్స్ టెండర్లను నిర్వహించారు. ఓపెన్ టెండర్‌లో సాకే పెద్దిరాజు రూ.1.76 కోట్లకు, బాక్స్ టెండర్‌లో శివకుమార్ రూ.1.91 కోట్లకు బిడ్ వేశారు.

News September 13, 2025

మైదుకూరు: తల్లీబిడ్డ మిస్సింగ్

image

మైదుకూరుకు చెందిన ముత్తరాయపల్లెలో నివసించే మేకల సుమతి (22) తన రెండేళ్ల కుమారుడు చందుతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనిపై భర్త చెండ్రాయుడు, ఆమె తల్లి మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సుమతి ఆచూకీ తెలిసినవారు మైదుకూరు సీఐ (9121100618), ఎస్సై(9121100619)కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News September 12, 2025

కడప: RI వీరేశంను సన్మానించిన ఎస్పీ

image

కడప జిల్లా పోలీసు శాఖకు RI వీరేశ్ ఎంతగానో సేవలు అందించాలని జిల్లా SP అశోక్ కుమార్ ప్రశంసించారు. శుక్రవారం బదిలీపై చిత్తూరుకు వెళ్తున్న ఆర్ఐ వీరేశ్‌కు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ అప్పగించిన విధులను సమర్ధవంతంగా నిర్వర్తించారన్నారు. వీఐపీల రాక సందర్భంలో ఆర్‌ఐ వీరేశ్ అంకితభావంతో విధులు నిర్వర్తించారన్నారు.