News March 21, 2025

గుండె పోటుతో లక్కిరెడ్డిపల్లి కానిస్టేబుల్ మృతి

image

అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ముకుంద గుండె పోటుతో మృతిచెందినట్లు ఎస్సై రవీంద్ర తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ముకుందకు గుండెపోటు వచ్చిందన్నారు. వెంటనే ఎస్సై పోలీసుల సాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతి చెందినట్లు వైద్యులు ద్రువీకరించారు

Similar News

News September 17, 2025

బతుకమ్మ పండుగకు గ్రేటర్ వరంగల్‌లో ఘనతరమైన ఏర్పాట్లు

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(GWMC) కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మంగళవారం ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. హన్మకొండలో 26 ప్రాంతాలు, వరంగల్‌లో 20 ప్రాంతాల్లో జరగనున్న వేడుకలకు శానిటేషన్, విద్యుత్ లైటింగ్, తాగునీటి సదుపాయాలను సమయానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News September 17, 2025

జగిత్యాల: రూ.300 అద్దె కోసం దారుణ హత్య

image

రూ.300 కోసం హత్య చేసిన ఘటన జగిత్యాల రూరల్ మండలం పొలాస-గుల్లపేట సమీపంలో చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్‌ నహిముద్దీన్‌ను అద్దె విషయంలో బీహర్‌కు చెందిన దర్శన్ సాహ్ని, సునీల్ సాహ్ని అనే కూలీలు దారుణంగా హతమార్చారు. ఆటో అద్దె విషయంలో వాగ్వాదం పెరగడంతో గుడ్డతో మెడకు ఉరి వేసి, బండతో మోది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ రఘు చందర్ వెల్లడించారు.

News September 17, 2025

సంగారెడ్డి: ఇంటర్ ప్రవేశాలకు నేడే చివరి అవకాశం

image

పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరేందుకు నేడే చివరి అవకాశమని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ప్రవేశాలకు సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉందని ఆయన చెప్పారు. జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గడువులోగా ప్రవేశం పొందకపోతే ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు.