News January 28, 2025

గుండ్ల‌క‌మ్మ‌ను నిర్వీర్యం చేశారు: గొట్టిపాటి

image

గ‌డిచిన ఐదేళ్ల కాలంలో సాగునీటి వ్య‌వ‌స్థ‌ను జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్వీర్యం చేశార‌ని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ విమ‌ర్శించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌ను పూర్తిగా గాలికి వ‌దిలేశార‌ని ఆరోపించారు. గుండ్ల‌క‌మ్మ ప్రాజెక్టును నిర్వీర్యం చేయ‌డ‌మే కాకుండా గేట్లు విర‌గొట్టి ఇసుక దోపిడీకి పాల్ప‌డిన చ‌రిత్ర జ‌గ‌న్ ప్ర‌భుత్వానిదే అని ధ్వజమెత్తారు.

Similar News

News July 11, 2025

పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹600 పెరిగి ₹99,000కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹550 పెరిగి ₹90,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1000 ఎగబాకి రూ.1,21,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News July 11, 2025

NZB: కూలీల కొరత.. పొరుగు రాష్ట్రాల నుంచి బారులు

image

నిజామాబాద్ జిల్లాలో కూలీల కొరత వేధిస్తోంది. ఇక్కడి వారు ఉపాధి కొసం మలేషియా, కెనడాతో పాటు పలు దేశాలకు వలస వెళ్తున్నారు. దీంతో జిల్లాలో కూలీల కొరత ఏర్పడుతుంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులకు జిల్లా రైతులు ఆహ్వానం పలుకుతున్నారు. వరినాట్లు, హమాలీ పనులకు బిహార్, బెంగాల్, మహరాష్ట్ర నుంచి కూలీలు వస్తున్నారు. ఒక ఎకరం వరినాట్లు వేస్తే రూ. 4000 నుంచి రూ. 5000 వరకు కూలీ చెల్లిస్తున్నారు.

News July 11, 2025

నిజామాబాద్: వామ్మో.. డెంగ్యూ

image

నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ కేసులు బెంబెలెత్తిస్తున్నాయి. గత నెలలో 25 కేసులు నమోదవ్వగా ఈనెలలో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు డెంగీ, సీజనల్ వ్యాధులు, విష జ్వరాలపై వైద్యాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కేసులు నమోదవుతున్నాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు కాచిచల్లార్చిన నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.