News October 18, 2024
గుంతకల్లులో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య.. మనస్పర్ధలే కారణం!

గుంతకల్లులో రైల్వే <<14386362>>ఉద్యోగి<<>> మధుసూదన్ బలవన్మరణానికి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలే కారణమని తెలుస్తోంది. పోలీసుల వివరాల మేరకు.. ప్రొద్దుటూరుకు చెందిన మధుసూదన్ మొదటి భార్య చనిపోగా హేమవతిని రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన గుంతకల్లులో సీనియర్ క్లర్క్గా పనిచేస్తున్నారు. దసరాకు ఊరికి వెళ్దామని భార్యను పిలవగా ఆమె రాలేదు. కొద్దిరోజులుగా వీరి మధ్య మాటల్లేవు. ఈ క్రమంలో ఉరేసుకుని మృతి చెందారు.
Similar News
News December 1, 2025
ఉపాధ్యాయుడిగా మారిన మంత్రి కేశవ్

ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉపాధ్యాయుడుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉరవకొండ మండలం బూదిగవి గ్రామ ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. గంటపాటు విద్యార్థులకు పాఠం చెప్పారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సమాధానం ఇచ్చారు. విద్యార్థుల తెలివితేటలను చూసిన మంత్రి ఆశ్చర్యానికి గురయ్యారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలలో అధిరోహించాలని విద్యార్థులకు ఆయన సూచించారు.
News December 1, 2025
నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి

ఉరవకొండ మండలం బూదిగవిలో రూ.43.75 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.
News November 30, 2025
2,81,298 మందికి పెన్షన్ పంపిణీ పంపిణీకి సిద్ధం: కలెక్టర్

అనంతపురం జిల్లాలో 2,81,298 మంది NTR భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు రూ.125.39 కోట్లు పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆనంద తెలిపారు. డిసెంబర్ 1న ఉదయం 6:30 గంటలకు పెన్షన్ లబ్ధిదారులకు సచివాలయ ఉద్యోగస్థులు పెన్షన్ పంపిణీ చేయాలన్నారు. పెన్షన్ పంపిణీ విధానాన్ని DLDO, MPDO, మున్సిపల్ కమిషనర్లు పరిరక్షించాలని ఆదేశించారు.


