News September 8, 2024
గుంతకల్లులో సోషల్ మీడియా వినాయకుడు
గుంతకల్లు పట్టణంలోని ఆంటోనీ స్ట్రీట్‌లో సోషల్ మీడియా వినాయకుడు కొలువుదీరాడు. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఉన్నందున అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల చిహ్నాలతో వినాయకుడిని ప్రత్యేకంగా తయారు చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు. వాట్సాప్, ఫేస్ బుక్, స్నాప్ చాట్ , ఇన్స్టాగ్రామ్, ట్విటర్, లింక్డ్ ఇన్, యూట్యూబ్, తదితర సోషల్ మీడియా గుర్తులతో కలిపి రూపొందించామన్నారు.
Similar News
News October 9, 2024
పల్లెకు మంచి రోజులు
గ్రామాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె పండుగ’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఈ నెల 14 నుంచి 20 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధికి సంబంధించి ఆగస్టు 23న నిర్వహించిన గ్రామ సభలో ప్రతిపాదించిన పనులకు శ్రీకారం చుడతారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.4500 కోట్లు కేటాయిస్తోంది. కాగా అనంతపురం జిల్లాలో 577, శ్రీ సత్యసాయి జిల్లాలో 427 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
News October 9, 2024
అనంతపురం జిల్లాకు వర్ష సూచన
అనంతపురం జిల్లాలో రానున్న 5 రోజుల్లో తేలిక పాటి నుంచి చిరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంటలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 32.5-34.8, రాత్రి ఉష్ణోగ్రతలు 23.5-24.6 డిగ్రీలు నమోదు అవుతుంనది పేర్కొన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం 80-83 శాతం నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు.
News October 9, 2024
అనంతపురంలో పోక్సో కేసు.. నిందితుడి అరెస్ట్
బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. అనంతపురం నగరంలోని జాకీర్ కొట్టాలకు చెందిన రవీంద్ర బాలిక(7)ను తన ఇంటి వద్దకు పిలిపించుకని అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై నిందితుడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు.