News February 25, 2026

గుంతకల్లు డివిజన్‌లో ఖాళీల భర్తీకి కసరత్తు

image

సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్లు డివిజన్‌లో పాయింట్స్ మెన్ ఖాళీల భర్తీ కోసం 16 మంది మాజీ సైనికులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. రూ.18,000 వేతనం, ఇతర భత్యాలు చెల్లించనున్నారు. మాజీ సైనికులు మార్చి 6వ తేదీ లోపు దరఖాస్తులను గుంతకల్లు డివిజన్ కార్యాలయానికి సమర్పించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 08554 241146 సంప్రదించవచ్చన్నారు.

Similar News

News April 14, 2026

అనంతపురంలో 48,116 మంది విద్యార్థుల ఎదురు చూపు..!

image

ఇంటర్ ఫలితాల విడుదలకు ప్రభుత్వం సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 10.31 గంటలకు రిజల్ట్స్ వెలువడనున్నాయి. అనంతపురం జిల్లాలో ప్రథమ సంవత్సరం 24,568 మంది, ద్వితీయ సంవత్సరం 23,578 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ఆర్ఐఓ రమణ నాయక్ తెలిపారు. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 13, 2026

హౌసింగ్ లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

అనంతపురం కలెక్టర్ ఆనంద్ హౌసింగ్ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పీఎంఏవై అర్బన్, గ్రామీణ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. ఎన్ఆర్ఈజీఏ కింద ఉపాధి అవకాశాలు పెంచాలన్నారు. పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

News April 13, 2026

PGRSలో 169 పిటిషన్లు స్వీకరించాం: SP జగదీష్

image

అనంతపురం పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 169 పిటిషన్లు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. వారి సమస్యలను తెలుసుకుని పోలీసు అధికారులకు ఫోన్ చేసి, ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. దంపతుల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, రస్తా వివాదాలు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయన్నారు.