News March 29, 2025
గుంతకల్లు: రైల్లో ప్రయాణికుడి మృతి

గుంతకల్లు మండలం పాత కొత్త చెరువు సమీపంలో ఇంటర్ సిటీ రైల్లో ప్రయాణిస్తున్న మహబూబ్ బాషా(59) శుక్రవారం మృతి చెందాడు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం కొక్కంటికి చెందిన ఈయన.. ఈనెల రెండో తేదీన గోవా వెళ్లాడు. తిరిగి సొంతూరుకు వెళ్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని తాడిపత్రిలో రైల్వే ఎస్ఐ నాగప్ప, పోలీసు సిబ్బంది స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 3, 2025
అనంతపురం జిల్లాలో 89 మంది కానిస్టేబుళ్ల బదిలీ

అనంతపురం జిల్లాలో బుధవారం కానిస్టేబుళ్ల బదిలీలు పారదర్శకంగా జరిగాయి. ఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించి 89 మందిని బదిలీ చేశారు. సీనియార్టీ ఆధారంగా సిబ్బంది కోరుకున్న చోటుకే స్థాన చలనం కల్పించారు. పట్టణాల్లో పని చేస్తున్న వారిని రూరల్ పోలీసు స్టేషన్లకు, రూరల్ ఏరియాలలో పని చేస్తున్న వారిని పట్టణ ప్రాంతాల స్టేషన్లకు బదిలీ చేశారు. 89 మందికి అక్కడికక్కడే బదిలీ ఉత్తర్వు ప్రతిని అందజేశారు.
News April 3, 2025
8న పాపిరెడ్డిపల్లికి వైఎస్ జగన్

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 8న రాప్తాడు నియోజకవర్గంలో పర్యటిస్తారని వైసీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. పాపిరెడ్డిపల్లిలో ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారని పేర్కొన్నారు. జగన్ పర్యటనకు జిల్లాలోని ప్రజాస్వామ్యవాదులు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని ఆయన మండిపడ్డారు.
News April 2, 2025
అనంత: ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం

అనంత ఆణిముత్యాలు ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ కింద ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో “అనంత ఆణిముత్యాలు” ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్మెంట్ సొసైటీపై సం.శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.