News September 21, 2024
గుజరాత్‌లో నాయకన్‌గూడెం యువకుడు మృతి
కూసుమంచి మండలం నాయకన్‌గూడెంకి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కంచర్ల లక్ష్మారెడ్డి కుమారుడు సంపత్ రెడ్డి గుజరాత్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ థర్డ్ఇయర్ చదువుతున్నాడు. శుక్రవారం కాలేజీకి వెళ్లివస్తున్న క్రమంలో ఓ వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడని తెలిపారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News October 16, 2024
ఎలాంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకొని రండి: ఎస్పీ
కొత్తగూడెం: పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది చిన్న చిన్న కారణాలు, సమస్యలతో మానసిక ఒత్తిడికి గురికావద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. మంగళవారం వీడియో కాన్పరెన్స్ ద్వారా కానిస్టేబుళ్లతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. తమకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. క్షణికావేశానికి లోనయ్యి తమ కుటుంబాల గురించి కూడా ఆలోచించకుండా ప్రాణాలు తీసుకోవడం చాలా బాధాకరమన్నారు.
News October 15, 2024
బాణసంచా దుకాణాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి: సీపీ
ఖమ్మం జిల్లాలో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకునే వ్యాపారస్తులు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం లోపు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకొని, అనుమతి పొందాలని సూచించారు. పోలీస్ శాఖ, నగర పాలక శాఖ, అగ్నిమాపక శాఖలు నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే అనుమతితో దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు.
News October 15, 2024
కమనీయం.. భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్య కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.