News September 24, 2024

గుజరాత్‌లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన

image

సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన హై లెవెల్ కమిటీ సభ్యులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఆ రాష్ట్రంలో పీపీపీ విధానంలో జరుగుతున్న రోడ్ల అభివృద్ధి, ఇతర అనేక అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది. నిన్న ఆ రాష్ట్ర ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి, చీఫ్‌ ఇంజినీర్లతో అహ్మదాబాద్‌లో సమావేశమై చర్చించారు.

Similar News

News October 12, 2024

హొళగుంద: దేవరగట్టులో నేడు కర్రల సమరం

image

ఇరు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన దేవరగట్టు కర్రల సమరం దసర సందర్భంగా శనివారం జరగనుంది. మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం అనంతరం జరిగే బన్ని ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని స్థానికులు తెలిపారు. బన్ని ఉత్సవాల్లో మూడు గ్రామాలు ఒక వైపు మరో ఏడు గ్రామాలు ఒకవైపు నుంచి తలపడుతాయి. కాగా కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

News October 11, 2024

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 13 నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.

News October 11, 2024

ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: నంద్యాల ఎస్పీ

image

నంద్యాల జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలు, పోలీసులు సంతోషంగా జీవించాలని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసులు ప్రజలతో మమేకమై పోలీస్ శాఖ ప్రతిష్ట పెంపొందేలా విధులు నిర్వర్తించాలని ఈ సందర్భంగా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆకాంక్షించారు.