News April 10, 2025
గుజరాత్లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించిన మంత్రులు

గుజరాత్లోని సత్పురా, వింధ్యాచల్ పర్వత శ్రేణుల్లోనూ నర్మదా నది తీరంలో.. కెవాడియా ప్రాంతంలోఉన్న సర్దార్ వల్లబాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని, మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సందర్శించారు. జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ పర్యాటక అభివృద్ధిలో భాగంగా దేశీయ, అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 20, 2025
చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.33 కోట్లు విడుదల

TG: రాష్ట్రంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రుణమాఫీ కోసం రూ.33 కోట్లు నిధులు రిలీజ్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత కార్మికుల అప్పులు తీర్చేందుకు వీటిని వినియోగించనున్నారు. నిధుల విడుదలపై చేనేత కార్మికులు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
News November 20, 2025
విజయవాడ: రెచ్చిపోతున్న రేషన్ మాఫియా డాన్.!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేదల బియ్యాన్ని దేశ సరిహద్దులు దాటించే రేషన్ మాఫియా డాన్ ఆగడాలు శృతిమించుతున్నాయి. నియోజకవర్గానికి ఒకరు చొప్పున నియమించుకొని బియ్యాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులకు సైతం నెలకు రూ.7 నుంచి రూ. 10 లక్షల వరకు ఈ మాఫియా డాన్ అవినీతి సొమ్మును ముట్ట చెబుతున్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధుల అండ ఉండడంతో అధికారులు కన్నెత్తైనా చూడలేకపోతున్నారు.
News November 20, 2025
మెదక్: ‘కల్లుగీత కార్మికులకు హామీలు నెరవేర్చాలి’

కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మెదక్లో గురువారం కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఆరవ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి హాజరయ్యారు. గౌడ కులస్తులకు బడ్జెట్లో రూ.5000 కోట్లు కేటాయించాలని, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.


