News July 21, 2024

గుజరాత్‌లో సిక్కోలు వాసి మృతి

image

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు గ్రామానికి చెందిన వలస కూలీ గండుపల్లి జగన్(45) శనివారం సాయంత్రం గుజరాత్ రాష్ట్రం కాండ్లలో మృతి చెందారు. ఇటీవల జీవనోపాధి కోసం కుటుంబంతో సహా గుజరాత్ రాష్ట్రం వెళ్లిన జగన్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Similar News

News October 8, 2024

SKLM: 2714 అభివృద్ధి పనులకు అనుమతులు- కలెక్టర్

image

రాష్ట్ర సచివాలయం నుంచి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహించే పల్లె పండుగ కార్యక్రమంపై మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో అన్ని పంచాయతీల పరిధిలో 3071 పనులు గుర్తించామని.. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ అభివృద్ధి పనులకు సంబంధించి రూ.249 కోట్లు అంచనా వేసినట్లు తెలిపారు. వీటిలో 2714 పనులకు అనుమతులు ఇచ్చామన్నారు.

News October 8, 2024

కంచిలి: భవానీ సన్నిధానంలో విషాదం

image

కంచిలి మండలం నారాయణ బట్టి గ్రామంలో భవానీ సన్నిధానంలో జరిగిన దారుణ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన భవానీ సన్నిధానంలో గ్రామానికి చెందిన కోన మణి (21) అనే భవానీ మాలధారణ చేసిన వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు గురు స్వామి సూచనలతో భవానీ మాలధారణ చేసిన భక్తులందరూ దీక్ష విరమించుకున్నట్లు వారు పేర్కొన్నారు.

News October 8, 2024

శ్రీకాకుళం: ఈ నెల 14వ తేదీన పల్లె పండుగ

image

ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు ‘పల్లె పండుగ’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లుచేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో పల్లె పండుగ కార్యక్రమాలపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.