News April 4, 2025
గుడిపల్లి: యువతిపై లైంగిక దాడి.. కేసు నమోదు

యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు గుడిపల్లె ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. రెండు రోజుల క్రితం సంతోశ్ ఓ యువతిని (18) ఆడుకుందామని నమ్మించి పొలం వైపు తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. యువతి కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. యువతి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News April 13, 2025
ఇంటర్ ఫలితాల్లో ఒకేషనల్ విద్యార్థుల సత్తా

INTER ఫలితాల్లో కుప్పం GOVT. ఒకేషనల్ JR కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు. 500 మార్కులకుగాను అనూష 497 స్కోర్ సాధించి టాపర్‌గా నిలిచింది. అభినయశ్రీ 495 భవ్యశ్రీ 494 స్కోర్‌తో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ జ్యోతి స్వరణ్ తెలిపారు.
News April 13, 2025
చిత్తూరులొ 14న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

సోమవారం అంబేడ్కర్ జయంతి రోజున ప్రభుత్వ సెలవు దినం కావడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News April 12, 2025
చిత్తూరు: అప్పుడు.. ఇప్పుడూ లాస్టే

ఈసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా చివరి స్థానంలో నిలవగా.. గతేడాది సెకండ్ ఇయర్ ఫలితాల్లో అట్టడగున నిలిచింది. 2024లో ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 10,882 మంది పరీక్షలు రాయగా.. 6,817 మంది పాసై 63 శాతం పర్సంటేజీతో 26వ స్థానానికి జిల్లా పరిమితమైంది. తాజా ఫలితాల్లో ఫస్ట్ ఇయర్‌లో 13,183 మందికి 7,168 మందే పాస్(54%) కావడంతో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే లాస్ట్ స్థానంలో నిలిచింది.