News July 9, 2024

గుడిపాలలో ATM దోపిడి..హరియాణా ముఠా పనే?

image

గుడిపాల SBI ATMలో ఆదివారం జరిగిన దోపిడీ హరియాణా ముఠా పనేనని పోలీసులు అనుమానంవ్యక్తం చేస్తున్నారు. మినీ GAS సిలిండర్, GAS కట్టర్‌తో ATM దోపిడీకి పాల్పడే తీరును పరిశీలించిన పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటకలోని ఓATMలో గ్యాస్‌ కట్టర్‌తో రూ.14లక్షలు దోపిడీ చేయగా..మరికొన్ని నిమిషాల వ్యవధిలో అస్సాంలో దోపిడీకి విఫలయత్నం, గుడిపాలలో దోపిడీ జరగడంతో హరియాణా ముఠా పనేనని అనుమానిస్తున్నారు.

Similar News

News November 21, 2025

బెంగళూరులో రూ.7కోట్ల దోపిడీ.. చిత్తూరులో కారు

image

బెంగళూరు జేపీ నగర్‌లో బుధవారం పట్టపగలే దోపిడీ చేసిన కొందరు ఏపీ వైపు వచ్చారు. అక్కడి HDFC బ్యాంకు ఏటీఎంలో నగదు జమ చేసే వాహనాన్ని కొంతమంది అడ్డుకున్నారు. రూ.7 కోట్ల నగదును నిందితులకు చెందిన ఇన్నోవా కారులోకి మార్చుకుని పారిపోయారు. చిత్తూరు(D) గుడిపాల మండలం చీలాపల్లి కూడలి పెట్రోల్ బంకు వద్ద కారు వదిలి పరారయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 21, 2025

చిత్తూరు జిల్లా టీచర్లకు గమనిక

image

చిత్తూరు జిల్లాలోని మున్సిపల్, ఎయిడెడ్, పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు HM అకౌంట్ టెస్టుకు ఈనెల 24వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో వరలక్ష్మి ఒక ప్రకటనలో సూచించారు. ఓ పేపర్‌కు రూ.100, 2పేపర్ల పరీక్ష రాసేందుకు రూ.150 చెల్లించాలన్నారు. రూ.60 అపరాధ రుసుముతో నవంబరు 30వ తేదీ లోపు చెల్లించాలని సూచించారు.

News November 21, 2025

చిత్తూరు: రాగుల పంపిణీకి చర్యలు

image

చిత్తూరు జిల్లాలోని రేషన్ షాపుల్లో డిసెంబరు నెల నుంచి రాగులు, జొన్నలు పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ లక్ష్మి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం జిల్లాకు 350 టన్నుల జొన్నలు, 350 టన్నుల రాగులను కేటాయించిందన్నారు. చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో వీటిని పంపిణీ చేస్తామన్నారు. కార్డుదారులకి ఇస్తున్న బియ్యం కోటాలో ఒక్కొక్క కేజీ వంతున రాగులు, జొన్నలు అందజేస్తామని చెప్పారు.