News February 28, 2025
గుడిపేట్‌లో పులి సంచారం!

హాజీపూర్ మండలంలోని గుడిపేట్, నంనూర్ గ్రామ శివారులో పులి సంచారం కలకలం లేపుతుంది. ఆ గ్రామ శివారులోని ర్యాలీ వాగు పరిసర ప్రాంతాల్లో పులి కదలికలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పశువులను అడవిలోకి పంపకూడదు గురువారం హెచ్చరికలు జారీ చేశారు. డిసెంబర్‌లో కూడా మండలంలో పులి పశువులు, గొర్రెల మందపై దాడి చేసి ఒక గొర్రె, రెండు ఆవులను చంపిన విషయం తెలిసిందే.
Similar News
News November 13, 2025
కరీంనగర్‌లో ఈనెల 18న JOB MELA

జిల్లాలోని నిరుద్యోగులకు ఓ ప్రముఖ జ్యూవెలర్స్‌లో ఈనెల 18న జాబ్ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతి రావు తెలిపారు. 60 పోస్టులు ఉన్నాయని, డిగ్రీ పూర్తి చేసి, వయస్సు19- 30 సంవత్సరాలలోపు ఉన్నవారు అర్హులన్నారు. వేతనం రూ.20,000 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఆసక్తి గలవారు నవంబర్ 18న వచ్చి పేరు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు పైనంబర్లను సంప్రదించవచ్చు.
News November 13, 2025
17న ఎమ్మెల్యేల అనర్హత సహా అన్ని పిటిషన్లపై విచారణ

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లన్నిటినీ సోమవారం (17వ తేదీ) విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. కోర్టు నిర్దేశించిన 3 నెలల గడువులోగా ఫిరాయింపు MLAలపై చర్యలు తీసుకోలేదంటూ BRS ఇటీవల స్పీకర్‌పై ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేయడం తెలిసిందే. వీటిపై నిర్ణయానికి మరో 2నెలల సమయం కావాలని స్పీకర్ కార్యాలయం అంతకు ముందే SCని కోరింది. అన్ని పిటిషన్లను కలిపి విచారణ చేస్తామని సుప్రీం తాజాగా స్పష్టం చేసింది.
News November 13, 2025
BOB క్యాపిటల్‌లో ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ బరోడా అనుబంధ సంస్థ BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీఏ, సీఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in/


